వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టే వారికీ చేదు వార్త. తిప్పలు తప్పవు.!!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది , కీప్యాడ్ ఫోన్ లలో కూడా ప్రస్తుతం వాట్సాప్ అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేటస్ లో వీడియోస్, పిక్స్, జిఫ్స్ పెట్టుకొనే ఆప్షన్ వచ్చాక, ప్రతి ఒక్కరు ఆ ఆప్షన్ ని వాడటం మొదలుపెట్టారు.

పండగలకి, ఫంక్షన్స్ కి :

ఒకప్పుడు పండగలు లేదా ఏవైనా ముఖ్యమైన రోజులు ఉంటే వాట్సాప్ కాంటాక్ట్స్ లో అందరికి విషెస్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు జస్ట్ స్టేటస్ లో ఒక ఫోటో నో లేదా వీడియో నో లేదా విషెస్ పెడితే చాలు, అందరికి రీచ్ అయిపోద్ది.

తిట్టిన వాళ్లే పొగిడారు గా :

ఇన్స్టాగ్రామ్ తరహా లో వాట్సాప్ లో కూడా స్టేటస్ ల ఆప్షన్ పెట్టడం తో మొదట అందరూ వాట్సాప్ ని ఎగతాళి చేసారు, ఇన్స్టాగ్రామ్ ఫీచర్ ని కాపీ కొట్టడం వల్ల వాట్సాప్ కి నష్టమే కానీ లాభం ఉండదు, ఈ ఫీచర్ ని ఎవ్వరు వాడరు అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. కానీ వాట్సాప్ లోని ఈ స్టేటస్ ఫీచర్ ని చాలా మంది వాడటం మొదలుపెట్టారు, ఎంతలా అంటే, కేవలం వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టడానికి వేరే వారి స్టేటస్ లు చూడటానికి వాట్సాప్ లు ఓపెన్ చేస్తున్నారు జనాలు. అంతలా పాపులర్ అయ్యింది.

పైసే పైసే :

చాలా మంది వాట్సాప్ ని వాడటానికి ముఖ్యకారణం వాట్సాప్ లో యాడ్స్ ఉండవు, ఫేస్బుక్ వాట్సాప్ ని కొని చాలా సంవత్సరాలు అవుతుంది, ప్రస్తుతం ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ యాడ్స్ శాతం ఎక్కువయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఒకరివే కావడం తో, వాట్సాప్ లో కూడా యాడ్స్ ని పెట్టాలని ఆలోచిస్తున్నారు, వాట్సాప్ స్టేటస్ లలో యాడ్స్ ని పెట్టాలని నిర్ణయించారు అట. త్వరలోనే మనం వాట్సాప్ స్టేటస్ లలో యాడ్స్ ని చూడబోతున్నాం.

ఇప్పుడు వాట్సాప్ లో యాడ్స్ ని ఫేస్బుక్ కి చెందిన యాడ్స్ సంస్థలు నడిపియనున్నాయి. అయితే యాడ్స్ ని చూపించడం ద్వారా ప్రైవసీ ని భంగపరచడం అని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండడం వల్ల మీ డేటా కి ఎలాంటి డోకా లేదు అని కొంత మంది వాదన. డేటా ని యాక్సెస్ చేయకుండా యాడ్స్ చూపించడం సాధ్యం కాదు అని మరికొందరి వాదన ఉంది, వీటి పై వాట్సాప్ నుంచే స్పష్టత రావాలి. దీనిపైన త్వరలోనే ప్రకటన చేయనున్నారని ప్రచారం కూడా జరుగుతుంది

Comments

comments

Share this post

scroll to top