నవంబర్ 8 అర్థరాత్రి మోడీ పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత …. ఉత్తర ప్రదేశ్ బిహండి పంచాయితీలో.. పంచాయితీ రాజ్ శాఖ అధికారిగా పని చేస్తున్నఓ వ్యక్తి కోపంతో……. ఉన్న పలంగా నోట్లు రద్దు చేస్తే మా పరిస్థితి ఏం కాను అసలు ఇదేం నిర్ణయం అంటూ ఘాటుగా రెచ్చిపోయాడు. అక్కడితో ఆగకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై అసభ్యకరమైన రీతిలో కొన్ని ఫోటోలను తనకు సంబంధించిన ఓ వాట్సాప్ గ్రూప్ లో ఫోస్ట్ చేశాడు. ఈ ఫోస్టులోని ఫోటోలు కాస్తా అన్ని గ్రూపుల్లోకి వైరల్ అయ్యాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోటోలు పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణలో సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా అతనిని పంచాయితీరాజ్ అధికారిగా సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది పంచాయితీ రాజ్ శాఖ. ఈయన ఫోస్ట్ కు మద్దతు తెలిపిన ఓ వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మొత్తానికి అతి కోపం ఆ అధికారి కొంపముంచింది. మా వాట్సాప్ గ్రూపే కదా అని ఇష్టం వచ్చిన ఫోస్టులు పెట్టారో మీకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు. సో బీ కేర్ ఫుల్. ఫోస్టు లు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మరీ మంచిది. అయితే మరోవైపు…..వ్యక్తిగత స్వేఛ్చను కూడా హరిస్తున్నారనేది మరికొంతమంది వాదన.!