వాట్సాప్ లో కొత్త మార్పులు….హోం స్క్రీన్ మీద‌కు వ‌చ్చిన ‘స్టేటస్ బ‌ట‌న్.!!

వాట్సాప్ లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. గ‌తంలో హోం స్క్రీన్ మీద క‌నిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో కెమెరా సింబల్, స్టేటస్, అనే రెండు కొత్త ఆప్ష‌న్స్ వ‌చ్చి చేరాయి.

కొత్త‌గా హోం స్క్రీన్ మీద‌కు వ‌చ్చిన స్టేట‌స్ బ‌టన్- దీని వ‌ల్ల ఉప‌యోగం ఎంటి? ఇది ఎందుకు??
మ‌న కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారెవ‌రైనా త‌మ స్టేట‌స్ మార్చినా, డిపి మార్చినా ఇక్క‌డ క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య స్టేట‌స్ కు చాలా మంది ఇంపార్టెన్స్ ఇవ్వ‌డంతో….వాట్సాప్ ఆ మార్పు తీసుకువ‌చ్చింది. ఇప్పుడు వీడియోను కూడా డిపి గా పెట్టుకునే అవ‌కాశం ఉంది.

కాంటాక్ట్ నెంబ‌ర్స్ కావాలంటే సెర్చ్ బ‌ట‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిందే:

ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో కాంటాక్టులు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే.. మనం చాట్స్ అనే ట్యాబ్‌లో ఉన్నప్పుడు పైన సెర్చ్ బటన్ పక్కన ఉండే సింబల్‌ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు వస్తాయి. ఇంతకుముందు కాంటాక్టులు చూసినప్పుడే అందులో వాళ్ల స్టేటస్ కూడా కనిపించేది. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ల ప్రొఫైల్ పిక్చర్, మనం సేవ్ చేసుకున్న పేరు మాత్రమే వస్తున్నాయి.

స్టేట‌స్ సెక్యురిటీ:
దీని కోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్టులలో ఉన్నవాళ్లంతా చూడచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మొద‌టిది డిపాల్ట్ గా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top