అబద్దాలు చెప్పేవాళ్లకు ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ శాపమే..! గర్ల్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ కి రెడీ అవ్వాల్సిందే..?

దేశ వ్యాప్తంగా 200 మిలియన్ యూజర్లు ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ‘ వాట్సాప్’. చాటింగ్,వాట్సాప్ కాల్ ,వాయిస్ మెస్సేజెస్ వంటి అధునాతనమైన ఫీచర్స్ తో,డేటా ను అత్యంత వేగవంతంగా ప్రాసెస్ చేస్తున్న వాట్సాప్ లోకి ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ రాబోతుంది,అదే ఈ నూతన “లైవ్ లొకేషన్ ఫీచర్” .

అసలు లైవ్ లొకేషన్ అంటే ఏంటి,ఇది ఎలా పనిచేస్తుంది ,దీనివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం.

ఈ లైవ్ లొకేషన్ అనే ఫీచర్ వాట్సాప్ లో వాడడం వల్ల మనం ఉన్న ప్రస్తుత లొకేషన్ ను తెల్పుతుంది, దీని వల్ల ఒక బిలియన్ యూజర్లు పరస్పరం వారున్న లొకేషన్లను పంపవచ్చట ,మీరు మీ ప్రేయసితో చాట్ చేసేటప్పుడు ఒకవేళ లొకేషన్ గురించి అబద్దం చెప్తే దొరికిపోయే ప్రమాదం ఉంది,కనుక అబద్దపు చాట్ చేసేవాళ్లకు,ఇతరులకు అసభ్యకరమైన సందేశాలను పంపేవారికి ఇది వ్యతిరేకం కనుక కొంచెం ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

వర్కింగ్ లేడీస్ ఇంటి నుండి ఆఫీస్ కు వెళ్ళేవాళ్లకు, కొంత భయం తప్పినట్లెయ్ , మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లోకేషన్ ను సెండ్ చేయడం ద్వారా ప్రమాదమునుండి తప్పించుకునే ఆస్కారం ఉంది.

ఇది ఎలా పని చేస్తుంది..?::

  • వాట్సాప్ ఓపెన్ చేసి అందులో లైవ్ షేరింగ్ ను యాక్టివేట్ చేయుటకు అటాచ్ అనే ఐకాన్ ను ప్రెస్ చేసి సంబంధిత ఆప్షన్లను సెలెక్ట్ చేయాలి ,
  • దీనిని గ్రూప్ చాట్ కి కూడా అనుసంధానం చేయవచ్చు , స్టాటిక్ లొకేషన్ ను ఎంపిక చేసి లొకేషన్ ను సెండ్ చేయొచ్చు,
  • దీనిని డీయాక్టివేట్ చేయుటకు అకౌంట్ ప్రైవసీ సెట్టింగ్స్ కి వెళ్లి మార్చేస్తే సరి.

బ్యాటరీ ప్రభావం::

వాట్సాప్ ప్రోడక్ట్ మేనేజర్ జాఫర్ ఖాన్ గారు తాము ఆవిష్కరిస్తున్న ఈ ఫీచర్ కి బ్యాటరీ వినియోగం చాలా తక్కువని,మరియు తమ వద్ద ఉన్న ఇంజనీరింగ్ టీం బ్యాటరీ పవర్ సేవింగ్ టెక్నిక్స్ ను ఉపయోగిస్తూ ,ఈ ఫీచర్ ను లాంచ్ చేసినట్టు వెల్లడించారు ,ఈ కనెక్షన్ అధికంగా యూస్ చేసేవాళ్లకు,లొకేషన్ సెండ్ చేసినప్పుడు అవతలి వ్యక్తి సులభంగా మ్యాప్ చూచుటకు బ్యాటరీ లెవెల్ తక్కువ వినియోగంతోనే జరిగేలా రూపొందించడం విశేషం. మరోవిషయమేమిటంటే వాట్సాప్ లో టెక్స్ట్ మెస్సేజ్ ల మాదిరిగా ఈ లొకేషన్ డీటెయిల్స్ ను ఎన్క్రిప్టు చేయవచ్చట… మరి ఇన్ని ఉపయోగాలున్న వాట్సాప్ ను మీరు సమర్థిస్తారా….??

Comments

comments

Share this post

scroll to top