ఎదుటి వారు “డిలీట్” చేసినా కూడా “వాట్సాప్ మెసేజ్” చదవొచ్చు..! ఎలాగో తెలుసా..? ట్రిక్ ఇదే..!

వాట్సాప్‌ మెసెంజర్‌. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ఇది. ఎప్పటికప్పుడు ఇందులో కొత్త కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. అవి యూజర్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యే వాట్సాప్‌లో ఓ కొత్త ఫీచర్‌ వచ్చింది తెలుసు కదా. అదేనండీ… యూజర్లు తాము అవతలి వారికి పంపిన మెసేజ్‌లను కొంత సమయం వ్యవధిలో డిలీట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అవును అదే. దీని వల్ల తెలియని వ్యక్తులకు మెసేజ్‌ పంపితే వెంటనే దాన్ని డిలీట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే నిజానికి ఈ ఫీచర్‌ వల్ల యూజర్‌ మెసేజ్‌ డిలీట్‌ చేసినప్పటికీ దాన్ని మళ్లీ చదవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అందుకు మనకు రెండు అవకాశాలు ఉన్నాయి. అవేమిటంటే…

ఆండ్రాయిడ్‌ ఫోన్లను వాడుతున్న యూజర్లకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో Notification History అనే ఓ యాప్‌ లభిస్తోంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. అనంతరం ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అందులో Android notification log ను సెర్చ్‌ చేయాలి. దీంతో వాట్సాప్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లను ఈ విధంగా మళ్లీ ఓపెన్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. ఇక మరో మెథడ్‌ ఏమిటంటే…

ఆండ్రాయిడ్‌ యూజర్లు హోమ్‌ స్క్రీన్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. అనంతరం వచ్చ్ ఆప్షన్లలో కింద కనిపించే Widgets అనే విభాగాన్ని ఎంచుకుని అందులో Activities > Settings > Notification log అనే విభాగాల్లోకి వరుసగా ఎంటర్‌ అవ్వాలి. అనంతరం వచ్చే నోటిఫికేషన్‌ లాగ్‌లో యూజర్‌ తాను డిలీట్‌ చేసిన వాట్సాప్‌ మెసేజ్‌లను వెతకవచ్చు. అవి అక్కడ కనిపిస్తాయి. అంతే.. ఈ రెండు పద్ధతుల సహాయంతో వాట్సాప్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లను కూడా తిరిగి పొందవచ్చు. అయితే ఈ రెండు మెథడ్స్‌కు ఒక మినహాయింపు ఉంది. అదేమిటంటే… సదరు డిలీట్‌ అయిన వాట్సాప్‌ మెసేజ్‌లో కేవలం మొదటి 100 అక్షరాలను మాత్రమే ఇలా తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది..!

Comments

comments

Share this post

scroll to top