7 నిమిషాల తర్వాత కూడా వాట్సప్లో మెసేజ్ ను డిలీట్ చేసే సింపుల్ ట్రిక్.!

వాట్సప్..ఛాటింగ్ కి అయినా,కాల్స్ కి అయినా,వీడియో కాల్స్ కి అయినా..ఫోటోస్,వీడియోస్ సెండ్ చేస్కోవడానికి అయినా ఎక్కువ మంది వినియోగించే యాప్..ఒక మన దేశంలోనే కోట్ల సంఖ్యలో వాట్సప్ వినియోగదారులున్నారు..అంతేకాదు ఫోన్స్ లోనే కాకుండా డెస్కటాప్ లో కూడా వినియోగించుకునే సౌకర్యం వాట్సప్ కి ఉంది.ఈ యాప్ ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో మార్పులొచ్చాయి.కొత్త కొత్త ఫీచర్స్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ యాప్ ఈ మధ్య ఒక కొత్త ఫీచర్ తెచ్చింది.అదేంటంటే మనం పొరపాటున ఎవరికన్నా మెసేజ్ చేస్తే అది వారికి కనపడకుండా డిలీట్ చేసే సౌకర్యం కల్పించింది..కాకపోతే అలా డిలీట్ చేయడానికి మెసేజ్ సెండ్ చేసిన ఏడు నిమిషాల కాలవ్యవధి మాత్రమే ఉండేది..కానీ ఆ తర్వాత కూడా మెసేజ్ డిలీట్ చేసే ట్రిక్ ఒకటుంది ఎలాగో తెలుసుకోండి..

Step  1 : ముందుగా మీ ఫోన్‌కు సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా టర్నాఫ్ చేసుకోండి. ఆ తరువాత సెట్టింగ్స్ ప్యానల్‌లోకి వెళ్లండి.

Step  2 : సెట్టింగ్స్‌లోని యాప్స్ సెక్షన్‌లోకి వెళ్లి వాట్సాప్‌ను సెలక్ట్ చేసుకుని Force Stop ఆప్షన్ పై టాప్ చేయండి.

Step 3 : పైన పేర్కొన్న ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయిన తరువాత మరొకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ఆటోమెటిక్ డేట్ అండ్ టైమ్’ అప్‌డేట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోండి.

Step  4 : తదుపరి స్టెప్‌లో భాగంగా ఫోన్‌లోని టైమ్ అలానే డేట్‌ను వాట్సాప్ చాట్‌లో మెసేజ్‌ పంపిన సమయం అలానే తేదీకి మార్చుకోండి.

Step 5 : తేదీ అలానే సమాయాన్ని అడ్జస్ట్ చేసుకున్న తరువాత డిలీట్ చేయలనుకుంటోన్న మెసేజ్ పై కొద్ది సెకన్ల పాటు హోల్డ్ చేసిన ఉంచినట్లయితే డిలీట్ ఆప్షన్ డస్ట్‌బిన్ ఐకాన్‌లో మీకు కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే ‘Delete For Me’, ‘Delete For Everyone’ పేర్లతో రెండు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. అందులో ‘Delete For Everyone’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మెసేజ్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఫోన్ డేట్ అలానే టైమ్ సెట్టింగ్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చేయండి.

Comments

comments

Share this post

scroll to top