మొట్టమొదటిసారిగా “వాట్సాప్ గ్రూప్ అడ్మిన్” అరెస్ట్..! ఏ ఫోటో పోస్ట్ చేయడం వల్ల అరెస్ట్ అయ్యాడో తెలుసా..?

బేసిక్ గా మనం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో బతుకుతున్నాము…వాట్స్ ఆప్, ఫేస్బుక్ ని హై రేంజ్ లో వాడేస్తున్నాము…దూరంగా ఉన్నవాళ్ళని ఎంతో దగ్గరచేస్తుంది ఈ సోషల్ మీడియా…ఇక వాట్సాప్ గ్రూప్లలో అయితే మనకి ఎక్కడలేని సమాచారం వచ్చేస్తుంటుంది. అదే విదంగా ఫేస్బుక్ లో కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు, ఎదుటి వారిని కించపరిచేలా వచ్చే పోస్ట్లు ఎక్కువ అయిపోయాయి. అయితే ఇకపై అది కుదరదు. ఫేస్బుక్, వాట్సాప్ నియమాల ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదు.

facebook-whatsapp

ఒక వ్యక్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయొచ్చంటూ వార‌ణాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ యోగేశ్వ‌ర్ గ‌త‌నెల‌లో తీర్పునిచ్చారు. గ్రూప్ మెంబెర్ తప్పుగా పోస్ట్ చేసిన గ్రూప్ అడ్మిన్ కే శిక్ష. అందుకే గ్రూప్ సభ్యులను చూసుకొని ఆడ్ ఛేస్యమని హెచ్చరించారు. ఇదేదో లైట్ అనుకున్నారు అంతా. కానీ కర్ణాటకలో ఒక గ్రూప్ అడ్మిన్ అరెస్ట్ సంగతి ఇందాకే వెలుగులోకి వచ్చింది..

ఆ గ్రూప్ పేరు “ది బాల్స్ బాయ్స్“. గ్రూప్ అడ్మిన్ “కృష్ణ సన్న తమ్మనాయక్“. ఆ గ్రూప్ లో గ్రూప్ మెంబెర్ “గణేష్ప్రధాని మోడీ ఫోటోను ఎడిట్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసాడు. భ‌క్త‌ల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విచారణ మొదలు పెట్టి. గణేష్, కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. అయితే గ‌ణేష్ బెయిల్‌పై విడుద‌ల కాగా, గ్రూప్ అడ్మిన్ “కృష్ణ” ను మాత్రం జుడీషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు.

 

Comments

comments

Share this post

scroll to top