‘ సింధు ‘ ని చూసి ఏమి నేర్చుకోవాలి??

సింధు సాధించిన వెండి పతకంతో భారతీయులందరు మురిసిపోయారనేది ముమ్మాటికీ నిజమే..! గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే వెర్రి వెంగలప్ప ప్రభుత్వాలు.. ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి? అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల సొమ్ముని ప్రసాదం లా పంచే హక్కు మీకెక్కడిది? ( అన్ని కోట్లా…? ) అంత ఆనందం పట్టలేకుంటే పార్టీ నిధుల్లోనుంచో మీ జేబు లోనుంచి ఇవ్వండి సంతోషిస్తాం. మీరు చేయవల్సిందీ , సింధు కి కోట్ల రూపాయలు , కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం ) సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తాయారు చేయాలి ,అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !!

pv

స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి. Play ground లేకపోతే PT సర్ లేకుంటె స్కూల్ మూసేయించండి. టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడవల్సిందే అని హుకుం జారీ చేయండి. Playing Kits , అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం? ) Olympics గాదు ముందు లోకల్ టోర్నమెంట్సు ,ఆడించండి లోకల్ టాలెంటెడ్ ‘ సింధూ ‘ లు చాలా మంది ఉన్నారు ,; పాపం మీ దరిద్రగొట్టు విద్యావిధానాల వలన ఇంటా ,బయట , స్కూల్లోనూ ప్రతి క్షణం ,చదువు,చదువు , పరీక్షలు, మార్కులు ,అని ఒకటే బెంగతో ఇటు తల్లితండ్రులు ,అటు పిల్లలు Class rooms లోనే ,homeworks తో మగ్గి పోతున్నారు , వారంతా , ఒక్కసారిగా ,మైదానంలో అడుగిడితే ,ప్రపంచంలో భారతీయులవే పధకాలు…. 125 కోట్ల జనాభా ఉంది చేయూతనివ్వండి , ఒకొక్క క్రీడకి శత వీరులు సిద్ధమవుతారు.

*జయహో భారత్ !!*

Source: FB.

Comments

comments

Share this post

scroll to top