మ‌య‌న్ల నాగ‌రిక‌త గురించి మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలు ఏమిటి..?

2012 డిసెంబ‌ర్ 21వ తేదీ గుర్తుందా? గుర్తుండ‌కేం? ఆ తేదీని అంత తేలిగ్గా మ‌రిచిపోగ‌ల‌మా? అంటారా? అవును, నిజ‌మే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని అధిక శాతం మంది ప్ర‌జ‌లు ఆ తేదీన ప్ర‌ళ‌యం వ‌స్తుంద‌ని, ఈ భూమి అంతా నాశ‌న‌మ‌వుతుంద‌ని భావించారు. కానీ చివ‌ర‌కు అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. అయితే ఆ తేదీ ప‌ట్ల అంత‌టి ఆస‌క్తి క‌ల‌గ‌డానికి కార‌ణం మ‌య‌న్ల క్యాలెండ‌రే. అవును, వారు రూపొందించిన క్యాలెండ‌ర్ ప్ర‌కారం 2012 డిసెంబ‌ర్ 21వ తేదీ నాడు ప్ర‌పంచం అంతం అవుతుంద‌ని తేల్చారు. కాక‌పోతే అలాంటి ఉప‌ద్ర‌వ‌మేదీ సంభ‌వించ‌లేదు. కానీ భ‌విష్య‌త్తులో ఎప్పుడో ఒక‌ప్పుడు ఏదో ఒక రూపంలో ప్ర‌ళ‌యం సంభ‌వించి అంతా నాశ‌న‌మ‌వుతుందని ఇప్ప‌టికీ అధిక శాతం మంది భావిస్తున్నారు. అయితే ఈ సంగ‌తి అలా ఉంచితే ఇక్క‌డ చెప్పుకోవాల్సింది మాత్రం మ‌య‌న్ల గురించే. అవును. దాదాపు 4వేల ఏళ్ల కిందట జీవించిన మ‌య‌న్ల గురించిన ప‌లు విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌య‌న్ల నాగ‌రిక‌త 4 వేల ఏళ్ల కింద‌టి నాటిద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. వారిని మెసోఅమెరిక‌న్లు అని కూడా పిలుస్తార‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న స‌ద‌ర‌న్ మెక్సికో, నార్త‌ర్న్ బెలిజ్‌, గ్వాటెమాలా ప్రాంతాల్లో మ‌య‌న్ల నాగ‌రిక‌త గురించి తెలియ‌జేసే ప‌లు నిర్మాణాలు ఇప్ప‌టికీ ఉన్నాయ‌ట‌. క్రీస్తు పూర్వం 1800 సంవ‌త్స‌రంలో మ‌య‌న్లు జీవించార‌ని, వారు అనేక అంశాల్లో ప్రావీణ్యుల‌ని చెబుతారు.

వ్య‌వ‌సాయం, కుమ్మ‌రి పని, క్యాలెండ‌ర్‌ను త‌యారు చేయ‌డం, చిత్రాతిచిత్ర‌మైన లిపిని రాయ‌డం, ఖ‌గోళ‌శాస్త్రం, గ‌ణితం, అత్యంత పెద్ద‌వైన నిర్మాణాలు చేప‌ట్ట‌డం, శిల్పాలు చెక్క‌డం వంటి ప‌నులు, క‌ళ‌ల్లో వారు ఆరితేరి ఉండేవార‌ట‌. మెక్సికో, అమెరికా, ద‌క్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన ప్ర‌జ‌లు మ‌య‌న్లుగా ఏర్ప‌డి సుమారు 1.25 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు మైళ్ల విస్తీర్ణంలో జీవ‌నం సాగించేవార‌ట‌.

Mayans-Writings

మ‌య‌న్ల భాష కూడా ఇత‌ర భాష‌ల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ట‌. వారి ప‌లు గుర్తులు, అక్ష‌రాలు, అంకెల‌ను విభిన్న‌మైన శైలిలో రాసేవార‌ట‌. ఈ క్ర‌మంలో వారు తమ భాష ద్వారా ఎలాంటి వాక్యాన్న‌యినా, ప‌దాల‌నైనా పూర్తి స్థాయిలో రాసేవార‌ట‌. ఇది వారు త‌మ భాష ద్వారా సాధించిన ఘ‌న విజ‌య‌మ‌ని అందరూ అనేవార‌ట‌.

మ‌యన్లు పెద్ద పెద్ద నిర్మాణాల‌ను చేప‌ట్ట‌డంలోనూ, శిల్పాలను చెక్క‌డంలోనూ సుప్ర‌సిద్ధుల‌ని చెప్పాం క‌దా. అందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను ఇప్పుడు మ‌నం చూడ‌వ‌చ్చు. పైన చెప్పిన స‌ద‌ర‌న్ మెక్సికో, నార్త‌ర్న్ బెలిజ్‌, గ్వాటెమాలా ప్రాంతాల్లో మ‌య‌న్ల నిర్మాణాలు, శిలా సంప‌ద ఇప్ప‌టికీ ఉన్నాయి. వాటిని చూస్తే మ‌య‌న్ల‌కు నిర్మాణ రంగం ప‌ట్ల ఉన్న ప‌ట్టు ఇట్టే అర్థ‌మైపోతుంది. అంత‌టి స‌హ‌జ సిద్ధ‌మైన రాతితో, ఆక‌ట్టుకునే డిజైన్లతో ఆయా నిర్మాణాల‌ను పిర‌మిడ్ల మాదిరి ఉండేలా నిర్మించారు మ‌య‌న్లు.

Tikal-City

చిత్రంలో ఉన్న భారీ నిర్మాణం చూశారుగా. అది క్రీస్తు శ‌కం 250 – 900 కాలం నాటికి చెందిన‌ది. దాన్ని తిక‌ల్ న‌గ‌ర‌మ‌ని మ‌య‌న్లు పిలిచేవారు. అక్క‌డ దాదాపు 90వేల మంది నివ‌సించేవార‌ట‌.

మ‌య‌న్లు ప‌లువురు దేవుళ్లు, దేవ‌త‌ల‌ను ఆరాధించేవార‌ట‌. ఈ క్ర‌మంలో వారు నిర్మించుకున్న ఓ ఆల‌యాన్ని కూడా కింది చిత్రంలో చూడ‌వ‌చ్చు.

Tikal-temple

పైన చెప్పిన తిక‌ల్ న‌గ‌రంతోపాటు కాల‌క్ర‌మంలో వారు అలాంటివే మ‌రో రెండు న‌గ‌రాల‌ను నిర్మించార‌ట‌. అందులో ఒక‌టి చిచెన్ ఇట్జా. మ‌రొక‌టి క‌లంకుల్‌.

Mayan-Cities

మ‌య‌న్ల క్యాలెండ‌ర్

Mayans-Calender

కాగా మ‌య‌న్లు అక‌స్మాత్తుగా ఎలా అంత‌రించిపోయారో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌ద‌ట‌. కొంత మంది వారి అంత‌ర్థానం గురించి ఏమంటున్నారంటే మ‌య‌న్లు తాము నివాసం ఉండే ప్రాంతాల్లోని వాత‌వ‌ర‌ణాన్ని, ప‌రిస‌రాల‌ను పూర్తిగా క‌లుషితం చేశార‌ని, అక్క‌డి ప‌రిస‌రాల్లో ఉండే వ‌న‌రుల‌న్నింటినీ అయిపోగొట్టార‌ని, దీంతో వారికి బ‌త‌క‌డం క‌ష్ట‌మై క్ర‌మంగా వారు అంత‌రించిపోయార‌ని చెబుతారు. అయితే ఇది నిజం కాద‌ని, అస‌లు వారు ఎలా అంత‌రించిపోయారో నిజంగా ఎవ‌రికీ తెలియ‌ద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఏది ఏమైనా మ‌య‌న్ల నాగ‌రిక‌త గురించి మాత్రం మ‌నం ఇంకా తెలుసుకోవ‌ల్సిందే. ఏమంటారు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top