రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే…మన ఇంట్లో ఏం జరగబోతోందో తెలుసా..!?

బ‌ల్లి క‌న‌ప‌డ‌గానే కొంద‌రు చీద‌రించుకుంటారు. మరికొంద‌రు ఒళ్లు జ‌ల‌ద‌రించిన‌ట్టు చేస్తారు. ఇంకొంద‌రు దూరంగా పారిపోతారు. అయితే మీకు తెలుసా..? బ‌ల్లి ఎదురు ప‌డ‌డం, లేదా పైన ప‌డ‌డం వ‌ల్ల మ‌న‌కు కొన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కొంద‌రు దీన్ని బ‌ల్లి శాస్త్రమ‌ని కూడా పిలుస్తారు. అందులోని కొన్ని ముఖ్య‌మైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

lizard

1. మ‌న దారికి అడ్డంగా బ‌ల్లి వ‌స్తుంటే దాన్ని బ‌ట్టి ఏం తెలుస్తుందంటే మ‌నం స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేద‌ని అర్థం చేసుకోవాలి.

2. మ‌న త‌ల లేదా కుడి చేయిపై బ‌ల్లి ప‌డితే అది మ‌న ఉద్యోగ వృద్ధిని తెలియ‌జేస్తుంది. అంటే భ‌విష్య‌త్తులో మ‌నం ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ పొందుతామ‌ని అర్థం చేసుకోవాలి.

3. మోకాళ్ల‌పై బ‌ల్లి ప‌డితే త్వ‌ర‌లో ఓ శుభ‌వార్త వింటామ‌ని తెలుసుకోవాలి.

4. బ‌ల్లులు రెండు పోట్లాడుతూ క‌నిపిస్తే మ‌నం మ‌న జీవితంలో అమితంగా ప్రేమించే వారితో విడిపోతామ‌ని అర్థం చేసుకోవాలి.

5. ఇంట్లో బ‌ల్లి చ‌నిపోయి క‌నిపిస్తే ఆ ఇంట్లోని వారికి అనారోగ్యం క‌లుగుతుంద‌ట‌.

6. ప‌గ‌టి పూట బ‌ల్లి అరుపు విన‌డం మంచిదేన‌ట‌. దాంతో మ‌న‌కు ఎలాంటి చెడూ క‌ల‌గ‌ద‌ట‌.

7. ఎవ‌రైనా మ‌హిళ పొట్ట‌పై బ‌ల్లి ప‌డితే వారికి త్వ‌ర‌లో గ‌ర్భం వ‌స్తుంద‌ట‌.

8. పాదాలు లేదా కాలి వేళ్ల‌పై బ‌ల్లి ప‌డితే అది మ‌న‌కు దుర‌దృష్టాన్ని క‌లిగిస్తుంద‌ట‌.

9. ఏదైనా విప‌త్క‌ర ప‌రిస్థితులు సంభ‌వించిన‌ప్పుడు బ‌ల్లులు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ మ‌న‌కు క‌నిపిస్తాయ‌ట‌.

10. ఏదైనా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే స‌మ‌యంలో బ‌ల్లి క‌న‌బ‌డితే అప్పుడు ఆ స‌మ‌స్య‌ను వ‌దిలి పెట్టేయాల‌ట‌.

Comments

comments

Share this post

scroll to top