ATM లో డ‌బ్బులు డ్రా చేసిన‌ప్పుడు న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే బ్యాంక్‌లో ఉన్న డ‌బ్బులు డ్రా చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి, ఫాం నింపి క్యాషియ‌ర్‌కి ఇస్తే కొంత సేపు వెయిట్ చేసిన త‌రువాత లైన్‌లో నిల‌బ‌డి డ‌బ్బులు తీసుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అధునాతన సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు వ‌చ్చేశాయి. అవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న‌కు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వాటిలో డ‌బ్బులు డ్రా చేసేందుకు య‌త్నించిన‌ప్పుడు డ‌బ్బులు అకౌంట్ నుంచి క‌ట్ అయి కూడా మెషీన్ నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే చిన్న కంప్లెయింట్ ఇచ్చి మ‌న డ‌బ్బును మ‌నం తిరిగి పొందేందుకు వీలుంది. దీంతో ఎలాంటి స‌మ‌స్యా లేదు. కానీ ఈ మ‌ధ్య ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు, ప్రింటింగ్ సరిగ్గా లేని నోట్లు  వ‌స్తున్నాయి. వాటిని తీసుకున్న వినియోగ‌దారులు బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ వారు త‌మ‌కేం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది. అయితే మీకు తెలుసా? ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌చ్చినా, సరిగ్గా ప్రింట్ అవ్వని నోట్లు వచ్చినా… వాటిని తిరిగి ఇచ్చి బ్యాంకుల ద్వారా అస‌లైన నోట్లు పొంద‌వ‌చ్చ‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇలాంటి స‌మ‌స్య ఎదుర‌య్యే వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Fake-Notes

ఏటీఎంలో న‌కిలీ నోట్లు రాగానే కంగారు ప‌డ‌కూడ‌దు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ ఉండే సెక్యూరిటీ గార్డుకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఇటీవ‌లి కాలంలో దాదాపు అధిక శాతం ఏటీఎంల వ‌ద్ద సెక్యూరిటీ గార్డులు ఉంటున్నారు. కాబ‌ట్టి న‌కిలీ నోట్లు రాగానే ఆ గార్డుకు విష‌యం చెప్పి అత‌ని వ‌ద్ద ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు డ్రా చేసిన మొత్తం, న‌కిలీ నోట్లు ఎన్ని వ‌చ్చాయి, ఏయే నోట్లు వ‌చ్చాయి, వాటి నంబ‌ర్లు, మీరు లావాదేవీ నిర్వ‌హించిన స‌మ‌యం, తేదీ, ఏటీఎం స్లిప్, దాని ట్రాన్‌సాక్ష‌న్ నంబ‌ర్‌ వంటి వివ‌రాలను అన్నింటిని ఆ రిజిస్ట‌ర్‌లో ఎంట‌ర్ చేసి గార్డు సంత‌కం తీసుకోవాలి. వీలైతే ఇప్పుడు చెప్పిన వివ‌రాల‌కు సంబంధించిన ఫొటోల‌న్నింటినీ స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసి భ‌ద్ర ప‌రుచుకోవాలి. అనంతరం పైన చెప్పిన ఆయా వివ‌రాల‌కు సంబంధించిన జిరాక్స్ ప్ర‌తుల‌ను తీసి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డి మేనేజ‌ర్‌కు ఫిర్యాదు చేయాలి. బాధితుడు తాను చేసిన లావాదేవీకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కూడిన ఓ లెట‌ర్‌ను రాసి మేనేజ‌ర్‌కు ఇవ్వాలి. దానికి ముందు చెప్పిన జిరాక్స్ ప్ర‌తుల‌ను కూడా ఇవ్వాలి. బ్యాంక్ వారు మీ ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ నోట్ల‌ను తీసుకుని వాటిని త‌మ ద‌గ్గ‌ర ఉండే ప‌రిక‌రాల ద్వారా స్కాన్ చేసి అవి నకిలీ నోట్ల‌నే విష‌యాన్ని ధృవ ప‌రుస్తారు. అనంత‌రం వాటికి బ‌దులుగా మీకు అంతే మొత్తంలో డ‌బ్బును ఇస్తారు.

vortex_engineering_solar_atm_india

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి బ్యాంక్ పైన చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఏ బ్యాంక్ అయినా స్పందించ‌క‌పోతే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసే హ‌క్కు బాధితునికి ఉంటుంది. అంతేకాదు త‌దుప‌రి చ‌ర్య‌గా బాధితుడు ఆర్‌బీఐ సైట్‌(www.rbi.org.in)లో ఉన్న మెయిల్ ఐడీకి త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు. లేదంటే స్థానికంగా ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అలా ఇచ్చిన ఫిర్యాదుకు ఆర్‌బీఐ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులు స్పందించి త‌క్ష‌ణ‌మే చ‌ర్య తీసుకుంటారు. బాధితునికి త‌గిన న్యాయం చేస్తారు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో. ఈ స‌మాచారాన్ని మ‌రింత మందికి షేర్ చేయడం మ‌రిచిపోకండి. దీని వ‌ల్ల న‌కిలీ నోట్ల‌ బాధితులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోగ‌లుగుతారు.

Comments

comments

Share this post

6 Replies to “ATM లో డ‌బ్బులు డ్రా చేసిన‌ప్పుడు న‌కిలీ నోట్లు వ‌స్తే ఏం చేయాలో తెలుసుకోండి..!”

 1. R.G.V says:

  Adi donga notani appude theleedukada.anduke meeru theesina dabbu cc camera ku chupinchi vellali.konthaina adharam vuntundu.

 2. shaik fareed says:

  A fake note detector machine should be kept in atm room

 3. Venkatarao ponnada says:

  Latest ATMs required which should scan before notes coming from ATM like Cash deposit machines which scans notes before accepting for deposit

 4. venkat says:

  Assalu donga notes vastunnai anitelsina tarvatha munduga danimeeda etuvanti charyalu teesukontunnaru. Adi safegard cheyavalsina duty govt. Di . Tarvata aa bhaditudu eppudiki telsukontado teliyadu.because adi kavalani chesunna mosam manadesamulo. Memu mosam chestunne untam. Meeru adi mosam ani telusukoni elacheyandi ani cheppatam entavaraku sababu. Edaina mistake iete oka sari ki apramattanga untadu manishi. Adugaduguna alane oka rule ga memu mosam chestamu. Meeru jagrattaga indandi ante entavaraku sababu. Enthavaraku ee tension kanuka deenini krukati vellatho saha niemoolinchataniki govt emichestundi. Adikooda a teliyacheste baguntundi.

 5. SITA RAMA RAO PONNALURI says:

  Please submit request through pmo website to equip atms with new generation atm machines which can filter fake currency from bundle before delivering to customers and scan currency while loading currency and delivery status report online and notify bank.

 6. mk reddy says:

  asalu atm lonki donganotes elavastaei bank prameyam lekunda,
  this was cheating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top