సినమా స్టార్స్ కి బోర్ కొడితే ఏం చేస్తారో తెలుసా..? అనుష్క‌, ప్ర‌భాస్, మ‌హేష్, ప‌వ‌న్…Etc.

మనలో చాలామంది బొర్ కొడితే ఏం చేస్తారు టీవి రిమోట్ పట్టుకుని చానెల్స్ మార్చుకుంటూ కూర్చుంటారు.లేదంటే కొందరు బాగా నిద్ర పోతుంటారు..ఇంకొందరు బుక్ చదవాలనుకుంటారు.. ఎక్కువమంది బొర్ కొడితే సినిమా ప్లాన్ చేస్తారు..అదే నిత్యం సినిమాల మద్య ఉండే నటులు బోర్  కొడితే ఏం చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా..

బ్రహ్మనందం:

బోర్ కొడితే బ్రహ్మనందం కామెడీ చూస్తూ  ఎంజాయ్ చేస్తుంటాం.అలాంటిది అసలు తన సినిమాలే కాదు ఏ సినిమాలు చూడని ఆ బ్రహ్మానందానికే బోర్ కొడితే ఏం చేస్తారబ్బా.. మట్టితో దేవుడి విగ్రహాలు చేస్తుంటారు. అవి కూడా ఆషామాషీగా కాదు.. ఒక ప్రపంచస్థాయి కళాకారుడు రూపొందించిన స్థాయిలో బ్రహ్మానందం మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తుంటాడు.

అనుష్క

బాహుబలిలో పుల్లలు ఏరుకున్న అనుష్క ఖాలీ సమయాల్లో బోర్ కొడితే ఏం చేస్తుందో తెలుసా..అమ్మడికి యోగాతోపాటు పెట్ యానిమల్స్ తో గడపడం చాలా ఇష్టమట. అందుకే కాస్త ఫ్రీ టైమ్ దొరికితేనో లేక బోర్ కొడితేనో హ్యాపీగా తన కుక్కపిల్లలతో ఆడుకుంటుందట.

వెంకటేశ్

వెంకటేశ్  బోర్ కొడితే ఏం చేస్తుంటారు అనే వారికి అతని లైఫ్ స్టయిలే ఆన్సర్ ఇస్తుంది..వెంకీ ఆధ్యాత్మికత వైపు వెళ్తారు.అదేవిదంగా వెంకీ క్రికెట్ అబిమాని అని మనకు తెలుసు..అతనికి బొర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో క్రికెట్ వీడియోస్ చూస్తుంటారట.

నాగార్జున

నటనతో పాటు  వ్యాపారాలు,అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాల్లో బిజిగా ఉండే మన మన్మధుడు నాగార్జున బోర్ కొట్టినప్పుడు తన తండ్రి నాగేశ్వర్రావు నటించిన క్లాసిక్ మూవీస్ ను ప్రయివేట్ థియేటర్ లో ప్రొజెక్షన్ వేయించుకొని చూస్తాడట.

బాలక్రిష్ణ

యాంగ్రీమాన్ బాలయ్య బాబు బోర్ కొడితే.. తన చిన్నప్పటి స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడట. లేదంటే.. తన ఇంట్లో పని చేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని తాను చేయగల సాయం చేస్తుంటాడట.

ప్రభాస్

తన డిజైనర్ మొదలుకొని.. కొందరు ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్సే. ఎల్లప్పుడూ తన స్నేహితులకు దగ్గరగా ఉండడం వలన అస్సలు బోర్ ఫీలవ్వడట ప్రభాస్. అందుకే కదా అందరూ ప్రభాస్ ని ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకొనేది..

మహేశ్ బాబు

ఫ్యామిలి హీరో అనగానే గుర్తొచ్చేది జగపతిబాబు..కానీ ఆ పదాలకు యాప్ట్ అయ్యేది మాత్రం ప్రిన్స్ మహేశ్ బాబు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఇదివరకు పుస్తకాలు చదువుకుంటూ కూర్చుండిపోతే మహేష్ బాబు.. ఇప్పుడు మాత్రం తన ముద్దుల తనయుడు గౌతమ్ లేక తనయ సీతారతో మాట్లాడుతూ వాళ్ళ స్కూల్ విశేషాల గురించి అడిగి తెలుసుకొంటాడట. ఇక వాళ్ళకి హాలీడేస్ వస్తే వాళ్ళతో కలిసి ఫారిన్ కంట్రీస్ లో విహరిస్తూ తెగ ఎంజాయ్ చేస్తాడు మన మహేష్ బాబు.

పవన్ కళ్యాణ్

ఎప్పుడూ పుస్తకాలు చదవడమో లేక మరీ ఫ్రీగా ఉంటే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి స్వయంగా మట్టి తవ్వి పాదులు వేయడం, మట్టి సర్ధడమో చేస్తూ ఉండే పవన్ కి అసలు బోరే కొట్టదట..ఖాలీ దొరికితే జనసేన పార్టీ పనుల్లో బిజిగా ఉండే పవన్ అస్సలు సినిమాలే చూడడనే విషయం మనకుతెలుసు.

Comments

comments

Share this post

scroll to top