ఇంట‌ర్వ్యూలో..ఓ బ్లాంక్ పేప‌ర్ ఇచ్చి సంత‌కం చేయ‌మంటే ఇత‌డు తెలివిగా ఏం చేశాడో తెలుసా??

ఒక‌త‌ను ఇంట‌ర్వ్యూ కు వెళ్ళాడు.. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి….ఉద్యోగానికి వ‌చ్చిన అభ్యర్దికి సంబంధించిన కొన్ని ప‌ర్స‌న‌ల్ ప్ర‌శ్న‌లు అడిగిన త‌ర్వాత‌…. సంత‌కాన్ని బ‌ట్టి వ్య‌క్తి వ్య‌క్తిత్వం చెప్పొచ్చని చెబుతూనే..ఏది…ఈ వైట్ పేప‌ర్ మీద నీ సంత‌కం పెట్టు అంటూ…ఓ వైట్ పేప‌ర్ అత‌ని చేతికిచ్చాడంట‌.!! ఆ వైట్ పేప‌ర్ ను తీసుకున్న అభ్య‌ర్థి కాసేపు ఆలోచించి వైట్ పేప‌ర్ ను నాలుగు వైపుల నుండి మ‌డిచి….. ఆ నాలుగు సైడ్స్ క‌వ‌ర్ అయ్యేలా సంత‌కం పెట్టి ఇంట‌ర్వ్యూయ‌ర్ కు ఇచ్చాడ‌ట‌.! అది చూసిన ఇంట‌ర్వ్యూ య‌ర్…..య‌స్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడ‌ట‌.!

అలా బ్లాంక్ పేప‌ర్ ఇచ్చి సైన్ ఎందుకు చేయ‌మ‌న్నాడు.?

బ్లాంక్ పేప‌ర్ మీద సైన్ చేయ‌మ‌న‌గానే చేసిన‌ట్టైతే….అభ్య‌ర్థికి లోక జ్ఞానం లేన‌ట్టు అర్థం. ఇలా చేయ‌మ‌నడం…అభ్య‌ర్థి కామ‌న్ సెన్స్ ను, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ను ప‌రీక్షించ‌డ‌మే.! ఒక‌వేళ నేను సైన్ చేయ‌ను అంటే కూడా అత‌నిని నెగెటివ్ గా అర్థం చేసుకోవొచ్చు…సో అటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితిని ఇలా తెలివిగా డీల్ చేయ‌డంతో…..అభ్య‌ర్థి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ న‌చ్చి ఉద్యోగం ఇచ్చార‌ట‌!

Comments

comments

Share this post

scroll to top