నిషిత్ మరణానికి కారణమైన కారును “నారాయణ” గారు ఏం చేసారో తెలుసా..?

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ (22) ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిశిత్ తన స్నేహితుడైన రాజా రవివర్మతో కలిసి బెంజ్ కారులో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడివైపు వస్తున్నారు. కారు అతి వేగంగా వెళ్తుండడంతో అదుపుతప్పి మెట్రో పిల్లర్ నెంబర్ 9 ను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ కూడా ప్రాణాలు నిలవలేదు. సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అక్క‌డే ఉన్న జీహెచ్ఎంసి ఉద్యోగులు వీరిని హుటాహుటిన అపోలో హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు….అప్ప‌టికే వీరు మృతి చెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతివేగమే ప్ర‌మాదానికి ప్రాథ‌మిక కార‌ణంగా భావిస్తున్నారు.

అయితే నిషిత్ మరణానికి కారణమైన కారును “నారాయణ” గారు ఏం చేసారో తెలుసా..? “నిషిత్” కు గుర్తుగా ఆ కారును రిపేర్ చేయించి ఇంట్లోనే పెట్టుకున్నారంట‌! నిషిత్ కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమని అందుకే అత‌డు త‌మ‌తో లేక‌పోయినా…అత‌నికిష్ట‌మైన కార్ ను త‌మ క‌ళ్ళ‌ముందు అలాగే ఉండాల‌ని….ఆ కార్ ను ఇంటి ముందుంచార‌ట‌!! కుమారుడిని బ‌లిగొన్న కార్ ను ఇంట్లో పెట్టుకోవ‌డం అరిష్టమని బంధువులంద‌రూ చెప్పినా కూడా నారాయ‌ణ ఎవ్వ‌రి మాట విన‌కుండా… నిషిత్ కు గుర్తుగా దానిని ఇంట్లో పెట్టుకున్నారంట . నారాయణ గారికి ముందునుండి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అంట!

Comments

comments

Share this post

scroll to top