నీది ఏ కులం ? అని ప్ర‌శ్నించిన ఓ వ్య‌క్తికి అత‌ను ఏమ‌ని స‌మాధానం చెప్పాడో తెలుసా..?

కులాలు, మ‌తాలు.. ఇవ‌న్నీ మ‌నుషులు సృష్టించుకున్న‌వే. దేవుడు వాటిని సృష్టించ‌లేదు. దేవుడిచే సృష్టించ‌బ‌డిన మ‌నుషులే కులాలు, మ‌తాలు అనే అడ్డుగోడ‌ల‌ను పెట్టుకుని వాటి ప‌రిధిలోనే మెలుగుతున్నారు. అంతే కానీ.. నిజానికి దేవుడు మ‌నిషికి కులాలు, మ‌తాల కుంప‌టి పెట్టుకోమ‌ని చెప్ప‌లేదు. నాగ‌రిక‌త ముసుగులో మ‌నిషి ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న జీవ‌న విధానం వైపుగా మళ్లుతున్నాడు కానీ.. ఇంకా కులాలు, మ‌తాల గోడ‌ల మ‌ధ్యే న‌లిగిపోతున్నాడు. వాటి వ‌ల్ల మ‌నిషి ఎంత ప‌త‌న‌మ‌వుతున్నాడో అత‌ను త‌న‌కు తానే అర్థం చేసుకోలేక‌పోతున్నాడు. ఏంటీ.. సడెన్‌గా ఈ కులాలు, మ‌తాల విష‌యం అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ.. కింద చిన్న సంభాష‌ణ ఉంది చ‌ద‌వండి..

ఒక రైలులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఎదురెదురుగా కూర్చుని ప్ర‌యాణం చేస్తున్నారు. ఉన్న‌ట్టుండి ఓ వ్య‌క్తి త‌న ఎదురుగా ఉన్న మ‌రో వ్య‌క్తిని అడిగాడు.

మొద‌టి వ్య‌క్తి: మీది ఏ కుల‌మండి ?
రెండో వ్య‌క్తి: సాఫ్ట్‌వేర్
మొద‌టి వ్య‌క్తి అందుకు ఆశ్చ‌ర్య‌పోతూ..
మొద‌టి వ్య‌క్తి: ఏంటీ.. జోక్ చేస్తున్నారా..? అలా అయితే మీ తండ్రిది ఏ కుల‌మో చెప్పండి.
రెండో వ్య‌క్తి (సీరియ‌స్‌గానే): ఎల‌క్ట్రిక‌ల్
అత‌ను అలా చెప్ప‌గానే మొద‌టి వ్య‌క్తికి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తాడు. అప్పుడు రెండో వ్య‌క్తి క‌ల్పించుకుని..
రెండో వ్య‌క్తి: కులాలు, మతాలు అనేవి మ‌నం సృష్టించుకున్నవి. దేవుడు సృష్టించిన‌వి కావు. గీత‌లో శ్రీ‌కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా..? ఏ వ్య‌క్తి కులమైనా అత‌ను చేసే ప‌నే అవుతుంది, కానీ అత‌ని పుట్టుక‌తో కులం రాదు.. అని అర్జునుడికి చెబుతాడు.
రెండో వ్య‌క్తి అలా చెప్పేస‌రికి మొద‌టి వ్య‌క్తికి మ‌ళ్లీ నోట్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్టు అవుతుంది. అలాగే ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య స్థితిలో ఉండిపోతాడు.

అవును మ‌రి.. నిజ‌మే.. అలాంటి కుల పిచ్చి ఉన్న‌వాళ్ల‌కు ఎప్ప‌టికీ అలాగే అవుతుంది. ఇంత తెలిసినా ఇంకా కుల పిచ్చి అనే జాడ్యంతో మ‌న స‌మాజంలో తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎప్పుడు మార్పు వ‌స్తుందో.. అది ఆశించ‌డం అత్యాశే అవుతుంది..!

Comments

comments

Share this post

scroll to top