ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఏర్పాటు చేస్తున్న యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు అంటే ఏమిటో మీకు తెలుసా..?

రిమూవబుల్ మీడియా స్టోరేజ్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్‌కు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. తక్కువ వ్యవధిలోనే పెద్ద మొత్తంలో డేటాను కాపీ చేయడం కోసం ఉపయోగించేది మొదలుకొని మీడియా కనెక్టర్స్‌గానూ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్ వంటి డివైస్‌లకు ఉండే చార్జింగ్ పోర్ట్స్‌లోనూ యూఎస్‌బీదే అగ్రస్థానం. కాగా ఇటీవలి కాలంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నిజానికి యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యూఎస్‌బీ 2.0, 3.0, 4.0 ఇలా ఇందులో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్లు వచ్చాయి. అయితే వెర్షన్ నంబర్ ఆధారంగా వాటి వేగం, విశిష్టతలు మారుతుంటాయి. కానీ ఉపయోగంలో ఉన్నవి రెండు రకాల యూఎస్‌బీ టైప్ పోర్ట్స్. అవి టైప్-ఎ, టైప్-బి. ఇవి కేవలం ఒక వైపు మాత్రమే కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. రెండో వైపు సరిపోవు. అంటే కేబుల్‌ కనెక్టర్‌ను దాని అమరిక ఆధారంగా కచ్చితంగా ఒక వైపుకు ఫిక్స్‌ చేయాలి. దాన్ని కిందకు తిప్పి రివర్స్‌లో కనెక్ట్‌ చేయలేం. అది పోర్టులో పట్టదు.

అయితే కొత్తగా వచ్చిన యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ద్వారా కేబుల్‌ కనెక్టర్‌ను ఎటైనా కనెక్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. పైకి, కిందకు తిప్పి ఎటంటే అటు యూఎస్‌బీ టైప్‌ సి కేబుల్‌ ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పోర్ట్ ఆకారం రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది.

యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ విశేషాలు…

1.రివర్సిబుల్ ప్లగ్ ఓరియెంటేషన్‌గా పిలవబడే ఈ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా డేటాను అధిక వేగంతో కాపీ చేసుకునేందుకు వీలుంది. ప్రస్తుతం చలామణీలో ఉన్న యూఎస్‌బీ వెర్షన్‌ల కంటే ఇది 10 రెట్లు ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. 10జీబీపీఎస్ గరిష్ట వేగాన్ని ఇది అందుకోగలదు.

2.చార్జర్స్ మీద ఆధారపడకుండా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ వంటి డివైస్‌లకు ఆన్ ది గో లో కూడా వేగంగా చార్జింగ్ చేసుకునే విధంగా ఈ పోర్ట్‌ను తీర్చిదిద్దారు.

3.యాపిల్ మాక్ బుక్‌లో ముందుగా ఈ యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ డెవలప్ అవగా ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న అనేక ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్, కెమెరాలు, కీబోర్డులు, ప్రింటర్స్, స్కానర్స్, టీవీలు వంటి అన్ని పరికరాల్లోనూ ఈ పోర్ట్‌ను ఆయా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి.

4.ప్రత్యేకమైన అడాప్టర్ సహాయంతో హెచ్‌డీఎంఐ, వీజీఏ వంటి పోర్ట్స్‌కు దీన్ని కనెక్ట్ చేసేలా డివైస్‌లను రూపొందిస్తున్నారు. దీంతో ఆయా పోర్ట్‌లకు ఇది ఇన్‌పుట్, ఔట్‌పుట్ పరికరంగా పనిచేయనుంది. ఎక్కువ కేబుల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు గాను యూఎస్‌బీ టైప్‌ సి పోర్టును తీర్చిదిద్దుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top