వైఎస్ వివేకా మరణం వెనుక బలమైన కారణం ఏమిటో తెలుసా.??

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఉదయం బాత్ రూంలో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు మొదటగా గుండెపోటుతో మరణించారని ధృవీకరించారు. ఇటీవలే వివేకా గుండె ఆపరేషన్ చేయించుకుని స్టంట్ వేయించుకోవడంతో మరోసారి గుండెపోటు రావడంతో బాత్ రూంలో పడి ఉండవచ్చని భావించారు..

కానీ వివేకా పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్ మార్టం నిర్వహించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా ది సహజ మరణం కాదని, ఎవరో కావాలని హత్య చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. కడప జిల్లా ఎస్పీ దీనిపై స్పందించారు. వివేకా బాత్ రూం, బెడ్ రూంలో రక్తపు మరకలు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై సెక్షన్ 175 కింద కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.

ఈ క్ర‌మంలో ఈ కేసులో మ‌రో కీల‌క వ్య‌క్తి పేరు తెర‌పైకి వ‌చ్చింది. గంగి రెడ్డి ఇచ్చిన స‌మాచారం మేర‌కు వివేనంద‌రెడ్డి మ‌రో స‌న్నిహితుడు ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి పేరు వెలుగులోకి వ‌చ్చింది. వివేక‌నంద‌రెడ్డికి, ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డికి మ‌ధ్య కొద్ది రోజుల క్రితం గొడ‌వ జ‌రిగింద‌ని, దీంతో కొద్దిరోజుల్లో పులివెంద‌ల‌లో సెన్షేష‌న‌ల్ వార్త వినిపిస్తుంద‌ని ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి అన్నార‌ని తెలుస్తోంది.

ఎన్నో ఏళ్ళుగా వివేకానంద‌రెడ్డి స్నేహం ఉన్న ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి వివేకా హత్య త‌ర్వాత అదృశ్య‌మ‌య్యారు. ప్ర‌స్తుతం పరారీలో ఉన్న ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి కోసం పోలీసుల ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి భార్య కూడా ఇంట్లో లేరు. పులివెందుల‌కే చెందిన క‌నుమూరి ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డికి గ‌తంలో నేర చ‌రిత్ర ఉంది. వివేకాకు అత్యంత స‌న్నిహితుడైన ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి హ‌త్య త‌ర్వాత మాయం అవ‌డంతో, అత‌ని పాత్ర ఏమైనా ఉందా అనే యాంగిల్‌లో అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్ప‌టికే ప‌లువురిని విచారించిన పోలీసులు ఎలాంటి అంచాన‌కు రాలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలో అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని సిట్ అధికారులు చెబుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top