పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపే ఎందుకు తిరుగుతుందో తెలుసా?

మీకు పొద్దుతిరుగుడు మొక్కల గురించి తెలుసా.? పోనీ పొద్దుతిరుగుడు పువ్వులైనా తెలుసా..? ఆ.. తెలిసే ఉంటుందిలెండి. ఈ పువ్వుకు ఒక లక్షణం ఉంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. అందుకే వీటిని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. అలాగే వీటిని ‘సూర్యకాంత’పుష్పాలు అని కూడా పిలుస్తారు. అయితే అవి సూర్యుని వైపుగా ఎందుకు తిరుగుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా గ్రీకులో ఒక కథ బాగా ప్రచుర్యంలో ఉంది, దానితో పాటు సన్ ప్లవర్ , సన్  ఉన్న వైపుకే  ఎందుకు తిరుగుతుందో సైన్స్ కూడా చెప్పింది. ఆ రెండింటి గురించి తెలుసుకుందాం.

గ్రీకు కథ అధారంగా.:
గ్రీకులు సూర్యుడిని ‘అపోలో’గా పిలుస్తారు. సూర్యుడి అందానికి  కైట్లీ అనే వనదేవత అతడిని అమితంగా ప్రేమించిందట. ఆ విషయాన్ని తెలుపగా సూర్యుడు తిరస్కరించాడు. కారణం సూర్యుడు జలదేవుని కుమార్తె అయిన డఫ్నేను ప్రేమించాడు.తన ప్రేమ సంగతి డఫ్నేకు చెబితే ఆమె తిరస్కరించింది. పదేపదే తన ప్రేమ విషయమై సూర్యుడు ఒత్తిడిచేయడంతో డఫ్నే, తన తండ్రి జలదేవుని ముందు మొరపెట్టుకోగా, జలదేవుడు తన కూతుర్ని మొక్కగా చేశాడు. దీంతో సూర్యుడు మనసు బాధపడింది. అయితే సూర్యుడినే ప్రేమిస్తున్న కైట్లీ, సూర్యుడి కోసం 9 రోజులపాటు అన్న పానీయాలు పక్కనపెట్టి, అక్కడే ఉంటూ సూర్యుడు వచ్చి వెళ్ళేంతవరకూ చూస్తూ ఉండేదట. అలా కైట్లీ పువ్వుగా మారిపోయింది. పువ్వుగా మారిన కైట్లీ ప్రతిరోజు తాను ప్రేమించిన సూర్యుడిని చూస్తూ ఉంటుందట…అందుకే  ఆ పువ్వునే మనం సన్ ఫ్లవర్ అని పిలుస్తున్నాం.
maxresdefault
సైన్స్ ఆధారంగా: 
పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు వైపు తిరగడానికి కారణం ఆ మొక్కలలో ఉండే ఫోటోట్రాఫిజమ్. సాధారణంగా మొక్కల పెరుగుదలకు సూర్యరశ్మి అవసరం. దాని కారణంగా మొక్కల పెరుగుదల జరుగుతుంది. మొక్కల పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించే చర్యను ఫోటోట్రాఫిజమ్. సన్ ఫ్లవర్ మొక్కలో ఉన్న అమినో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆక్సిన్ హార్మోన్  కారణంగా పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరుగుతుంది. సూర్యరశ్మి పడనిభాగంలో ఆక్సిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పువ్వు ఎప్పుడైతే సూర్యుడి వైపు తిరుగుతుందో దాని వెనుక భాగంలో ఆక్సిన్ ఉత్పత్తి అవుతుంది. దానివలన ఆ భాగం త్వరగా పెరిగి, పువ్వు కదులుతుంది. నీడ ఉన్నవైపు పువ్వు వెనుక భాగం కదిలితే, పువ్వు ముందుభాగం సూర్యుడి వైపుకు కదులుతుంది. ఈ కారణంగానే పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుడి పొద్దు వైపుకు తిరుగుతూ అభిముఖంగా ఉంటుంది.
304835-sunflower

Comments

comments

Share this post

scroll to top