రూపాయి కాయిన్స్‌పై ఉన్న సింబల్స్‌ను ఎప్పుడైనా గమనించారా..? వాటి ద్వారా ఏం తెలుస్తుంది..?

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మనుగడకు కచ్చితంగా ధనం కావల్సిందే. ఏ అవసరమైనా డబ్బు లేనిదే తీరదు. ఈ క్రమంలో వ్యక్తులు తాము సంపాదించే స్థాయిని బట్టి డబ్బులను ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బులో కరెన్సీ అయినా, కాయిన్స్ అయినా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ తయారుచేయబడుతుందో మీకు తెలుసా? ప్రధానంగా నిత్యం మనకు చిల్లర కోసం ఎంతగానో అవసరమయ్యే రూపాయి బిళ్లపై పలు రకాల సింబల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? తెలియదా..! అయితే ఇప్పుడు తెలుసుకోండి.
కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను ప్రింట్ చేసే కేంద్రాలను మన దగ్గర మింట్‌లని పిలుస్తారు. ఇవి మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాల్లో ఇవి డబ్బును ముద్రిస్తున్నాయి.
ఒక్కో మింట్ ముద్రించే రూపాయి కాయిన్స్‌పై ఒక్కో రకమైన సింబల్ ఉంటుంది.
కరెన్సీని ముద్రించే తొలి మింట్ కేంద్రం కోల్‌కతాలో 1757లో నెలకొల్పబడింది. అయితే దేశంలో ఇదే తొలి మింట్ కేంద్రం అనే దానికి సంకేతంగా కోల్‌కతా మింట్ ముద్రించే రూపాయి కాయిన్స్‌పై ఎలాంటి సింబల్ ఉండదు. కాయిన్‌పై అది ముద్రించబడిన సంవత్సరం కింద ఎలాంటి సింబల్ లేకుండా ఆ ప్రదేశం ఖాళీగా ఉంటుంది.
kolkata-mumbai-mints
కోల్‌కతా తరువాత ముంబైలో 2వ మింట్ ఏర్పాటైంది. దీన్ని 1829లో నెలకొల్పారు. ముంబై మింట్‌లో ముద్రించబడిన రూపాయి బిళ్లలపై డైమండ్ ఆకృతి కలిగిన మార్క్ ఉంటుంది. దీన్ని కాయిన్‌పై ఉండే సంవత్సరం కింద స్పష్టంగా చూడవచ్చు.
దీంతోపాటు ఆంగ్ల బి, ఎం అక్షరాలు ఉన్నా వాటిని ముంబై మింట్‌లో తయారైనవిగానే భావించాలి. అయితే 1996 తరువాత తయారైన కాయిన్స్‌ను గుర్తు పట్టేందుకు వాటిపై ఎం అక్షరాన్ని ప్రింట్ చేశారు.
mumbai-hyd-noida-mints
భారత్‌లో 3వ కరెన్సీ ముద్రణా కేంద్రం 1903లో హైదరాబాద్‌లో నెలకొల్పబడింది. స్టార్ ఆకారంలో కాయిన్‌పై సింబల్ ఉంటే దాన్ని హైదరాబాద్ మింట్‌లో ముద్రించినట్టుగా తెలుసుకోవాలి.
ఇక చివరిగా 1984లో నోయిడాలో చివరి మింట్‌ను ఏర్పాటు చేశారు. కాయిన్‌పై ముద్రించబడిన సంవత్సరం కింద చుక్కలాగా ఒక డాట్ ఉంటే దాన్ని నోయిడా మింట్‌లో ముద్రించారని భావించాలి.
పైన చెప్పినవే కాకుండా మరికొన్ని సింబల్స్‌తో ప్రింట్ అయిన కాయిన్స్ కూడా ఉన్నాయి. అయితే ఆయా కాయిన్స్ అన్నింటినీ ఇతర దేశాల్లో ప్రింట్ చేశారు, కాబట్టే వాటిపై గుర్తులు వేరే విధంగా ఉంటాయి. భారత్‌లో తీవ్రమైన కరువు, అత్యవసర పరిస్థితులు, వనరుల కొరత ఉన్నప్పుడు కాయిన్స్ ముద్రించడం కష్టతరమైంది. అందుకే ఆయా సమయాల్లో కాయిన్స్‌ను ఇతర దేశాల్లో ప్రింట్ చేయాల్సి వచ్చింది.
different-mints

Comments

comments

Share this post

scroll to top