మ‌న దేశంలో అత్యంత వేగవంత‌మైన మొబైల్ ఇంట‌ర్నెట్‌ను అందిస్తుంది ఏ సంస్థో తెలుసా..?

మొన్నా మ‌ధ్య నుంచి టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మన దేశంలో త‌న‌దే వేగ‌వంత‌మైన మొబైల్ ఇంట‌ర్నెట్‌ను అందించే సంస్థ అని డంకా బ‌జాయించి మ‌రీ ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చింది తెలుసు క‌దా. ఎక్క‌డ చూసినా ఇదే విష‌యానికి చెందిన హోర్డింగ్‌ల‌ను కూడా ఎయిర్‌టెల్ ఏర్పాటు చేసింది. అయితే ఎయిర్‌టెల్ ఇలా ప్ర‌చారం చేసుకునే సరికి జియోకి మండింది. దీంతో ఈ విష‌యంపై ట్రాయ్ (టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా) కి జియో ఫిర్యాదు చేసింది. దీంతో ట్రాయ్ స్పందిస్తూ ఎయిర్‌టెల్ త‌న యాడ్‌ను ఉప‌సంహరించుకోవాల‌ని ఆదేశించింది. అయితే అది సరే… మ‌రి నిజానికి మన దేశంలో వేగ‌వంత‌మైన మొబైల్ ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్న సంస్థ ఏది..? తెలుసుకోవాల‌నుందా..? అయితే ఇది చ‌దవండి..!

మ‌న దేశంలో వేగ‌వంత‌మైన మొబైల్‌ ఇంట‌ర్నెట్‌ను అందిస్తోంది జియోనే..! అవును, మేం చెబుతోంది నిజ‌మే. దీన్ని మేం చెప్ప‌డం లేదు. ట్రాయ్ స్వ‌యంగా ఈ వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఎయిర్‌టెల్ త‌మ‌దే వేగ‌వంత‌మైన మొబైల్ నెట్‌వ‌ర్క్ అని ప్ర‌క‌టించుకోవ‌డం ఏమో గానీ ఇప్పుడ‌దే ఆ సంస్థ‌ను కొంప ముంచింది. ఎందుకంటే ఆ జాబితాలో నిజానికి ఎయిర్‌టెల్ ది 3వ స్థానం. ఎయిర్‌టెల్ క‌న్నా ముందు 2వ స్థానంలో ఐడియా ఉంది. 16.48 mbps నెట్‌స్పీడ్‌ను అందిస్తూ జియో మొబైల్ ఇంట‌ర్నెట్‌లో మొద‌టి స్థానంలో ఉండ‌గా ఆ త‌రువాతి స్థానంలో ఐడియా (8.22 mbps), ఎయిర్‌టెల్ (7.66 mbps)లు నిలిచాయి.

ఇక ఆ త‌రువాత స్థానాల్లో బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఆర్‌కాం, టాటా డొకొమొ, ఎయిర్‌సెల్‌లు నిలిచాయి. ఈ క్ర‌మంలో అత్యంత చెత్త నెట్‌వ‌ర్క్‌గా ఎయిర్‌సెల్ నిల‌వ‌డం విశేషం. 6.13 mbps ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుండ‌గా, 5.66 mbps ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను వొడాఫోన్ అందిస్తోంది. 2.67 mbps స్పీడ్‌ను ఆర్‌కాం, 2.52 mbps స్పీడ్‌ను టాటా డొకొమొ, 2.01 mbps స్పీడ్‌ను ఎయిర్‌సెల్‌లు అందిస్తున్నాయి. ఈ స్పీడ్ టెస్ట్‌ను ట్రాయ్ స్వ‌యంగా ప‌రీక్షించింది కూడా. కాబట్టి వినియోగ‌దారులారా..! ఇప్పుడు మీరే తేల్చుకోండి, ఏ నెట్‌వ‌ర్క్ సిమ్‌ల‌ను వాడాలో..!

Comments

comments

Share this post

scroll to top