బస్సులో ఓ యువతికి ఎదురైన షాకింగ్‌ సంఘటన ఇది. రియల్‌ స్టోరీ..!

”అప్పుడు నాకు 20 సంవత్సరాలు. ఐఐటీలో చదువుతున్నా. కాలేజీకి ఇచ్చిన సెలువులు పూర్తి కావడంతో ఇంటి నుంచి తిరిగి కాలేజీకి ప్రయాణమయ్యా. కాలేజీ నుంచి మా ఇంటికి చాలా దూరం ఉంటుంది. అందుకు ఏకంగా 14 గంటలు పడుతుంది. కనుక నేను సాయంత్రం 6 గంటలకు బస్‌ బుక్‌ చేసుకున్నా. ఒక్కదాన్నే ప్రయాణానికి సిద్ధమయ్యా. అది ఒక ఏసీ సెమి స్లీపర్‌ బస్సు. సీట్లు కొద్దిగా వెనక్కి ఉంటాయి. మనకు కావల్సినట్టు వాటిని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. అలాంటి సీట్లు ఉన్న బస్సు అది. అందులో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నా. టైముకు చేరుకుని బస్‌ ఎక్కా.

బస్‌ మొత్తం దాదాపుగా ఫుల్‌గానే ఉంది. నా సీటు వెనుక కొద్ది సీట్ల దూరంలో మా కాలేజీలో చదివే ఓ సీనియర్‌ స్టూడెంట్‌ ఎక్కాడు. అతని విష్‌ చేశా. వెల్కం చెప్పాడు. నేను నా సీట్లో కూర్చున్నా. నా పక్కన ఓ మహిళ తన పిల్లాడితో కూర్చుని ఉంది. నా వెనుక సీట్లో ఓ 25-28 ఏళ్ల వయస్సున్న యువకుడు కూర్చున్నాడు. అతని పక్కన ఓ వ్యక్తి ఉన్నాడు. మా అంకుల్‌ అంత వయస్సు ఆ వ్యక్తికి ఉంటుంది. అలా కాలేజీకి బస్సులో నా జర్నీ ప్రారంభమైంది. అయితే అర్థరాత్రి 1 గంట అయ్యిందనుకుంటా. అప్పుడే నాకు ఎందుకో మెళకువ వచ్చింది. ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం కష్టతరమైంది. ఎందుకా అని లేచి చూశా. అప్పుడు జరిగిన సంఘటనను చూసి నిర్ఘాంతపోయా.

నా వెనుక సీట్లో ఉన్న ఆ యువకుడి చేయి నా ఛాతిపై ఉంది. నా వక్షోజాలను గట్టిగా ప్రెస్‌ చేస్తున్నాడు. అందువల్లే నాకు తేడా అనిపించింది. వెంటనే అరిచా… ఏంట్రా.. ఏం చేస్తున్నావ్‌ నువ్వు ? నువ్వేం పాడు పని చేస్తున్నావో నీకర్థమవుతుందా ? అని అన్నా.. అందుకు అతను స్పందించలేదు. అప్పటి వరకు నా సీటుపై ఆనుకుని ఉన్న అతను తన సీట్లో వెనుకకు వాలిపోయాడు. వెనక్కి తిరిగి మళ్లీ అదే అన్నా. అప్పుడు ఆ యువకుడి పక్కన ఉన్న ఆ అంకుల్‌ లాంటి వ్యక్తి ఏమైంది ? అని అడిగాడు. ఆ యువకుడు.. ఏమీ లేదంకుల్‌.. ఈమే.. కావాలని సీన్‌ చేస్తుంది అన్నాడు. దీంతో ఆ అంకుల్‌ సరే అని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. పూర్తిగా అస్సలేం జరగలేదు అన్నట్టుగా, తనకు సంబంధం లేనట్టుగా అతను పక్కకు తిరిగి నిద్రలోకి వెళ్లిపోయాడు.

బస్సులో నా అరుపు విన్నా ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఎవరూ వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. దీంతో ఆ యువకుడు మళ్లీ అన్నాడు. నేను ఏం చేశానో చెప్పండి. నేను ఏమీ చేయకపోతే మీరు సైలెంట్‌గా కూర్చోండి అన్నాడు. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్‌ అయ్యా. నేను ఇలాంటి సమాజంలో ఉన్నందుకు నాకు సిగ్గనిపించింది. ఒక యువతికి ఇలాంటి ఘటన ఎదురైతే స్పందించేవారు లేనందుకు చాలా బాధేసింది. అయితే అంతలో మా కాలేజీ సీనియర్‌ స్టూడెంట్‌ ముందుకు వచ్చి అన్నాడు. చూడు బాస్‌.. నువ్వేదో తప్పుడు పనే చేసి ఉంటావు, కనుక మర్యాదగా ఆవిడకు సారీ చెప్పు.. అన్నాడు. అయినా ఆ యువకుడు స్పందించలేదు. అలా మా కాలేజీ స్టూటెండ్‌ మరో రెండు సార్లు అతన్ని అడిగాడు. అయినా అతను సారీ చెప్పలేదు. తాను ఏ తప్పూ చేయనివాడికిమల్లే అలాగే సీట్లో కూర్చుని నిద్రపోయాడు… ఇదీ నాకు జరిగిన అత్యంత చేదైన షాకింగ్‌ ఘటన. ఇలాంటి ఘటన ఎవరికీ ఎదురు కాకూడదు. అప్పటి నుంచి నేను ఒంటరిగా అలా ప్రయాణించడం లేదు. ఇప్పటికీ ఆ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకే ఈ పోస్టు రాశా..!”

— ఓ యువతి లైఫ్‌లో జరిగిన రియల్‌ సంఘటనే ఇది..! యదార్థ గాథ.

 

Comments

comments

Share this post

scroll to top