మొద‌టి నెల జీతంతో కొన్న ఫోన్ బాగా లేద‌ని ఓ ఆఫీస్‌బాయ్‌కు మ‌రో బాయ్ చెప్పాడు. త‌రువాత ఏం జ‌రిగిందంటే..

ఆ రోజు మా ఆఫీస్‌లో జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. కొత్త‌గా ఆఫీస్ బాయ్ ఉద్యోగంలో చేరిన ఓ బాయ్‌ మొద‌టి నెల జీతం అందుకున్నాడు. దాంతో ఓ ఫోన్ కొన్నాడు. దాన్ని ఇంకో ఆఫీస్ బాయ్‌కు చూపించాడు. అప్పుడు ఆ ఆఫీస్‌బాయ్ ఆ బాయ్‌ని ఎగ‌తాళి చేసిన‌ట్టు మాట్లాడాడు. దాని రేట్ అడిగి తెలుసుకుని, అదే రేట్‌లో మంచి ఫీచ‌ర్లు ఉన్న ఫోన్లు చాలా ఉన్నాయ‌ని, అంత‌క‌న్నా మంచి ఫోనే వ‌చ్చేద‌ని, డ‌బ్బును వేస్ట్ చేశావ‌ని అనే స‌రికి ఆ బాయ్‌కి ముఖంలో నెత్తుటి చుక్క లేదు. అత‌ను బాగా ఫీల‌య్యాడు.

అలా ఆ కొత్త ఆఫీస్ బాయ్ తాను కొన్న ఫోన్ బాగాలేద‌ని ఫీల‌వుతూ డిస‌ప్పాయింట్‌మెంట్‌లో ఉండిపోయాడు. అప్పుడు నేను వెళ్లి అన్నా.. ఫ‌ర్లేదు. ఏం బాధ‌ప‌డ‌కు. నీకు న‌చ్చినది ఇత‌రుల‌కు నచ్చాల‌ని ఏమీ లేదు. వారికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అంత మాత్రాన నువ్వు కొన్న ఫోన్ బాగాలేన‌ట్టు కాదు. అది నీకు న‌చ్చింది, అవ‌త‌లి వ్య‌క్తికి న‌చ్చ‌లేదు. అది అత‌ని స‌మ‌స్య‌. నీకు న‌చ్చిన ఫోన్‌ను నువ్వు కొన్నావు క‌నుక బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు. అంద‌రికీ ఒకే ఫోన్ న‌చ్చాల‌నే రూల్ ఏమీ లేదు. నీకు న‌చ్చిన ఫోన్ క‌నుక నువ్వు కొన్నావ్‌.. క‌నుక సంతోషంగా ఉండు.. అంటూ నాలుగు మాట‌లు చెప్పే స‌రికి ఆ బాయ్ మ‌ళ్లీ హ్యాపీగా ఫీల‌య్యాడు.

ఆ రోజు ఆఫీస్‌లో జ‌రిగిన ఆ ఘ‌ట‌న ఇప్ప‌టికీ నాకు ఇంకా గుర్తుంది. దాన్ని త‌ల‌చుకుంటే ఓ విష‌యం గుర్తుకు వ‌స్తుంది. అదేమిటంటే.. ఎవ‌రైనా వ్య‌క్తి ఏదైనా చేయ‌బోయే ముందు మ‌న నిర్ణ‌యం అడిగితే అప్పుడది బాగుంటుంది అనో, బాగుండ‌దు అనో నిర‌భ్యంత‌రంగా చెప్ప‌వ‌చ్చు. కానీ ఎవ‌రైనా వ్య‌క్తి ఆల్రెడీ ప‌ని చేశాక ఎలా ఉంది అన‌డిగితే అత‌ను నొచ్చుకునేలా మాత్రం స‌మాధానం చెప్ప‌కూడ‌దు. ఇదే విష‌యం నాకు ఎప్ప‌టికీ గుర్తుకు వ‌స్తూ ఉంటుంది. అది నిజ‌మే క‌దా..!

https://www.quora.com/What-is-something-that-needs-to-be-said/answer/Sandeep-Chaudhary-32

Comments

comments

Share this post

scroll to top