కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటో, అది ఎందుకు వ‌స్తుందో తెలుసా.? వచ్చినప్పుడు కాపాడడానికి ఏం చేయాలంటే.?

ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి ఫిబ్ర‌వరి 24వ తేదీన కార్డియాక్ అరెస్ట్ తో స‌డెన్‌గా మృతి చెందిన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లో త‌న మేన‌ల్లుడి పెళ్లికి హాజ‌రైన ఆమె హోట‌ల్ గ‌దిలో ఉన్న బాత్ ట‌బ్‌లో కుప్ప కూలి చ‌నిపోయింది. అయితే నిజానికి శ్రీ‌దేవికి గ‌తంలో ఎన్న‌డూ హార్ట్ స‌మ‌స్య‌లు రాలేదు. హార్ట్ ఎటాక్‌లు కూడా రాలేదు. అలాంటిది ఒక్క‌సారిగా ఇలా కార్డియాక్ అరెస్ట్ రావ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. అంతటి ఆరోగ్య‌వంత‌మైన మ‌నిషికి స‌డెన్‌గా కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వ‌చ్చిందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ నిజానికి మీకు తెలుసా..? హార్ట్ ఎటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

హార్ట్ ఎటాక్ అంటే ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డం లేదా ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డ‌డం వంటి కార‌ణాల వ‌స్తుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా కాదు. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తికి కూడా ఇది రావ‌చ్చు. కార్డియాక్ అరెస్ట్ వ‌స్తే గుండెకు అస‌లు ఏమాత్రం ర‌క్తం పంప్ కాదు. దీంతో బాధితులు కింద ప‌డిపోతారు. ప‌ల్స్ ఉండ‌దు. శ్వాస తీసుకోరు. స్పృహ కోల్పోతారు. ఈ స‌మ‌స్య‌లు ఉంటే దాన్నికార్డియాక్ అరెస్ట్ అని అనుమానించాలి. ఇక‌ కార్డియాక్ అరెస్ట్ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిలో కొన్ని…

1. మాన‌సిక ఒత్తిడి అధికంగా ఉండ‌డం
2. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం
3. అధిక బ‌రువు ఉండ‌డం
4. నిత్యం శారీర‌క శ్రమ చేయ‌క‌పోవ‌డం
5. పోష‌కాహార లోపం
6. ర‌క్తంలో ఎల‌క్ట్రోలైట్స్ స్థాయిలు ప‌డిపోవ‌డం

పైన చెప్పిన కార‌ణాల వ‌ల్ల కార్డియాక్ అరెస్ట్ వ‌స్తుంది. అయితే శ్రీ‌దేవికి మాన‌సిక ఒత్తిడి అధికంగా ఉండ‌డం వ‌ల్లే కార్డియాక్ అరెస్ట్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. నిజానికి హార్ట్ ఎటాక్ వ‌స్తే బాధితున్ని హాస్పిట‌ల్‌కు వేగంగా త‌ర‌లిస్తే బ‌తికేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా కాదు. బాధితునికి అంత స‌మ‌యం ఉండ‌దు. అది వ‌స్తే దాని తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణం సంభ‌విస్తుంది. క‌నుక ఎవ‌రైనా దీని ప‌ట్ల అవ‌గాహ‌న‌ను క‌లిగి ఉంటే ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌చ్చు. కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ ఏది వ‌చ్చినా బాధితున్ని నేల‌పై ప‌డుకోబెట్టి ఛాతిపై బ‌లంగా ఒత్తుతూ ఉండాలి. నిమిషానికి 120 సార్లు అలా చేయాల్సి ఉంటుంది. దీన్నే cardiopulmonary resuscitation (CPR) అంటారు. దీని వ‌ల్ల గుండె పోటు వ‌చ్చిన‌వారు బ‌తికే అవ‌కాశాలు పెరుగుతాయి. అయితే ఎవ‌రైనా ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న శైలిని క‌లిగి ఉంటే హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం మానేయ‌డం, ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డం వంటి ప‌నులు చేస్తే గుండె స‌మ‌స్య‌లే కాదు ఏ అనారోగ్యాన్న‌యినా రాకుండా చూసుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top