డిసెంబర్ 31 లోపు “ఆధార్” ను ఈ 6 తో లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా.? ఏది ఏమవుతుందంటే.?

ఆధార్ లింక్ చేశారా? చేయలేదా?చేయకపోతే ముందు ఆ పని చేయండి లేదంటే తిప్పలు తప్పవు . బ్యాంకు ఖాతాలు, బీమా చెల్లింపులు,. ఐటీ రిటర్నులు  ఇలా అన్నిపనులు ఆగిపోవచ్చు.. ఇంకా మీ మొబైల్ కనెక్షన్  కట్ … సబ్బిడీ కట్.. పెన్షన్లు కట్ కట్ కట్.. చివరికి మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావు. కాబట్టి ఎన్ని పనులున్నా పక్కనపెట్టి ముందుగా ఈ పని చూడండి..చివరి తేధి డిసెంబర్ 31..

2017, డిసెంబర్ 31తో ఆధార్ లింక్ చేయాల్సిన లిస్ట్ ఇలా ఉంది :

పాన్ కార్డు,బ్యాంక్ అకౌంట్,ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్),బీమా పాలసీలు,క్రెడిట్ కార్డులు,పోస్టాఫీస్ పథకాలు,మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు..

  • 2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదే విధంగా బీమా మొత్తాలను పొందలేరు.
  • ఐటీ రిటర్న్ లను పరిశీలించరు. రిటర్న్ లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్  చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది.

  • క్రెడిట్ కార్డు ఉన్న ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే.. జనవరి తర్వాత కార్డు ద్వారా లావాదేవీలు జరగపటంపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
  •  గృహరుణాలు, ఇతర ఫైనాన్స్ సంస్థల తీసుకున్న అప్పుకి కూడా ఆధార్ అనుబంధానం చేయాలి. లేకపోతే ఆయా ఖాతాల ద్వారా లాదేవీలు ఆగిపోనున్నాయి.
  •  ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందే వారు అంటే పెన్షన్, రేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందాలంటే కచ్చితంగా డిసెంబర్ 31, 2017లోగా ఆయా ఖాతాలకు అధార్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి.

Comments

comments

Share this post

scroll to top