ఇండియా మ్యాప్ ను తీసుకొని, మన 12 జ్యోతిర్లింగాలను కలిపితే…ఏమొస్తుందో తెలుసా.? చూస్తే ఆశ్చర్యపోతారు!

మనదేశంలోని  ప్రతీ సంస్కృతీ, సాంప్రదాయాలలో  ఎంతో కొంత సైన్స్ మిళితమై ఉంటుంది.  క్షుణ్ణంగా పరిశీలించాలే కానీ….ఆ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవోచ్చు. అలాంటి అద్భుతమే మన జ్యోతిర్లింగాలు.  శివుని ప్రతిరూపాలుగా భావించే 12 లింగాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు.  వీటిని దర్శించిన ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకము. ఈ నమ్మకాన్ని కాసంత పక్కకు పెట్టి…ఇప్పుడు  జ్యోతిర్లింగాల  స్థాపనలో దాగున్న సైన్స్ ను ఓ సారి పరిశీలిద్దాం.

మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఫిబోనసి సీరిస్ గురించే తెలిసుంటుంది. అదేనండీ…..1,2,3,5,8,13,21,34,55………….  ఇలా వీటిని ఆధారంగా చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే…ఫిబోనసి గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది ఓ బిందువు నుండి రౌండ్ గా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది.  ( పాత సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెప్పేటప్పుడు గిర్రున తిరిగే ఓ చక్రాన్ని వేస్తారు చూడండి అలా…..)

ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ను తీసుకొని  మన దేశంలోని జ్యోతిర్లింగాలను దానిపై  గుర్తించి ఒక్కొక్కటిగా కలుపుకుంటూ వద్దాం… ఉత్తరాఖండ్ లోని కేదారి నాథ్ నుండి ప్రతి జ్యోతిర్లింగాన్ని టచ్  చేసుకుంటూ ఓ సర్కిల్ ను గీస్తుంటే…అలా అలా అది వైద్యనాథ్, రామేశ్వరం, సోమ్ నాథ్……శ్రీశైలం.  ఇలా …ఇలా మహారాష్ట్రలోని ఘృష్టీశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మనం చేసిన సర్కిల్ ను చూస్తే….ఇదే ఫిబోనసి సీరిస్ గ్రాఫ్. కింద చూపించిన విధంగా ఉంటుంది.

#మన పూర్వికులు తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ…..ఈ పరికల్పన మాత్రం ఓ గణిత విద్యార్థికి నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ( Hari OAm)

india

ద్వాదశ జ్యోతిర్లింగాలు: 

 1. రామనాథస్వామి లింగము – రామేశ్వరము
 2. శ్రీశైల క్షేత్రము|మల్లికార్జున లింగము – శ్రీశైలము
 3. భీమశంకర లింగము – భీమా శంకరం
 4. ఘృష్టీశ్వర లింగం – ఘృష్ణేశ్వరం
 5. త్రయంబకేశ్వర లింగం – త్రయంబకేశ్వరం, త్రయంబకేశ్వరాలయం, నాసిక్
 6. సోమనాథ లింగము – సోమనాథ్
 7. నాగేశ్వర లింగం – దారుకావనం (ద్వారక)
 8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు – ఓంకారక్షేత్రం
 9. మహాకాళ లింగం – ఉజ్జయని
 10. వైధ్యనాథ లింగం – చితా భూమి (దేవఘర్)
 11. విశ్వేశ్వర లింగం – వారణాశి
 12. కేదారేశ్వర – కేదారనాథ్

Comments

comments

Share this post

scroll to top