“రంగస్థలం” లో ఈ నలుగురికి ఫేస్బుక్ ఉంటే…వారి ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసా.? చూసి నవ్వుకోండి.!

రాంచరణ్,సమంతా జంటగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..1980 పరిసరాలను, పరిస్థితులను సుకుమార్ కళ్లకు కట్టినట్టు చూపించారు.అంతేకాదు సమాజంలో  ఆనాడు ఉన్న అసమానతలను వేలెత్తి చూపించారు..అవి నేటికి మారలేదనుకోండి..ఈ సినిమాలో రాంచరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.మిగిలినవారు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు..అయితే రంగస్థలం పాత్రలకు ఫేస్ బుక్ అకౌంట్స్ ఉంటే ఎలా ఉంటాయో ఒకసారి మీరే లుక్కేయండి..

చిట్టిబాబు (సౌండ్ ఇంజినీర్) :

రాంచరణ్ చెవిటి వాడిగా నటించి మెప్పించాడు..తొలుత రాంచరణ్ ఈ పాత్ర ఎలా పోషిస్తాడో అనే అనుమానాలుండేవి..కాని సినిమా విడుదల తర్వాత ఆ పాత్రలో రాంచరణ్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం..కామెడిని,సెంటిమెంట్ని సమపాళ్లల్లో పండించారు..అన్నంటే ప్రాణం ఇచ్చే పాత్రలో చిట్టిబాబు పాత్ర సూపర్..మర మన చిట్టిబాబు  ఫేస్ బుక్ అకౌంట్..ఎలా ఉందో తెలుసా…చిట్టిబాబు డీటెయిల్స్ చదవడం మర్చిపోకండే..

రామలక్ష్మి :

డీ గ్లామర్ పాత్రలో కూడా సమంత సూపర్ అనిపించింది.రామలక్ష్మిని చూసిన ఎవరైనా ఎంత సక్కగున్నావే అని పాడుకుని తీరాల్సిందే..రామలక్ష్మి ఫేస్ బుక్ అకౌంట్ నుండి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా..చేసేయండి మరి..

కుమార్ బాబు :

కుమార్ బాబు పాత్రకు ఆది పూర్తి న్యాయం చేశారు..ఆది చనిపోయినప్పుడు వచ్చే సీన్స్,సాంగ్ సినిమాకే హైలైట్…కుమార్ బాబు ఫేస్ బుక్ అకౌంట్ ఏమని ఉంటుందో గెస్ చేయగలరా..

ఫణీంద్ర భూపతి :

ప్రెసిడెంట్ గా ఫణీంద్ర భూపతి పాత్రకు సరిగ్గా సరిపోయారు జగపతి బాబు..బాడీ లాంగ్వేజ్ కాని,డైలాగ్ లు పలకడంలో కాని సరిగ్గా ప్రెసిడెంట్ గా సూట్ అయ్యారు..ఇక ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ అన్ని ఇన్ని కావు..ఇక ఈయన ఫేస్ బుక్ అకౌంట్ ని ఒక లుక్కేయండి..ఫణీంద్ర భూపతి బయో చదివితే నవ్వాపుకోలేరు.

Comments

comments

Share this post

scroll to top