యూట్యూబ్ లో పొగడ్తలు..ఫేస్బుక్ లో తిట్లు..! “అరుణ రెడ్డి” అంట.. తెలిసి చేసిందో తెలియక చేసిందో.?

అర్జున్ రెడ్డి…తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం.. ఇప్పటివరకూ సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు లేవని కాదు. ఈ సినిమా పిల్లల్ని చెడగొట్టేదిలా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు..మరికొందరు సినిమా బాగుందని ప్రశంసించారు కూడా ..ప్రశంసలు,విమర్శల మధ్య సినిమారిలీజవడం హిట్టవడం…విజయ్ దేవరకొండ,సందీప్ రెడ్డి వంగా ఒవర్ నైట్ స్టార్స్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి..అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ మాత్రం జనాల్ని వీడలేదు..డైలాగులు మాత్రం ఎవరూ మర్చిపోలేదు.స్పూఫులు ఆగలేదు..ఇప్పటివరకూ ఎన్ని స్పూఫులొచ్చాయో కానీ ఈ మధ్య అరుణా రెడ్డి అని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అర్జున్ రెడ్డి లా ఒకమ్మాయి బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియో..నిజంగా ఇందులో నటించిన ప్రత్యూష అనే అమ్మాయి గట్స్ కి మాత్రం మెచ్చుకోవాలి..అర్జున్ రెడ్డి సినిమాకు గానూ సందీప్ వంగా,విజయ్ దేవరకొండ చాలా మంది చేత తిట్లు కూడా తిన్నారు.బొల్డ్ నెస్ ఉందనే అల్లు అర్జున్,శర్వానంద్  సినిమాను కాదనుకున్నారు కూడా.. అలాంటిది ఈ షార్ట్ ఫిలింలో ఒకమ్మాయి నటించడానికి ఒప్పుకోవడం గ్రేటే కదా..నాణేనికి మరోవైపు నా ఫీలింగ్…పిచ్చి పీక్స్ కి వెళితే ఎలా ఉంటుందో ఈ స్పూఫ్ చూస్తే తెలుస్తుంది..ఎవరేమనుకుంటారో అనే ఇబ్బందితో సందీప్ రెడ్డి ,అర్జున్ రెడ్డి తీసుంటాడు అనుకున్నా..ఎవరేం అనుకుంటే నాకు ఏంది అన్నట్టు తీసినట్టుంది అరుణా రెడ్డి…కొందరికి నచ్చినప్పటికీ ,మరికొందరికి వెగటు పుట్టిస్తుంది..అలాంటివాళ్లు ఎవరున్నా చూడకండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top