రాజధాని నిర్మాణం కోసం “రాజమౌళి” సలహాలు..మరి ఈ 10 మంది డైరెక్టర్స్ సలహా ఇస్తే ఎలా ఉంటది? [JUST4FUN]

మాహిష్మతి రాజ్యం అభిమానుల మతి పోగొట్టింది..పెద్ద పెద్ద విగ్రహాలు ,కోట నిర్మాణం ,సింహాసనాలు ప్రతిది ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ రాజమౌలి కృషి ఉంది,.ఇప్పుడు అదే మహిష్మతి రాజ్య నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకర్శించింది..అందుకే స్వయంగా ఎపి గవర్నమెంట్ నుండి రాజమౌలి కి పిలుపువచ్చింది..అమరావతి రాజధాని నిర్మాణం గురించి రాజమౌలి సలహాలు తీసుకోవాలని ఎపి గవర్నమెంట్ భావిస్తుందని ఆ పిలుపు సారాంశం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అమరావతిని ప్రపంచస్థాయి ప్రజా రాజధానిగా నిర్మిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు.ఇదిలా ఉండే, మళ్లీ పద్దెనిమిది శతాబ్దాల అనంతరం.. అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది. అమరావతికి ఎంతో చరిత్ర ఉంది.  ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విరాజిల్లిన అమరావతి సువిశాలమైనది.  అలాంటి చారిత్రక రాజధాని అమరావతిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధానిగా ఎంచుకుంది. సమైక్య ఏపీ విభజన అనంతరం విభజిత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో, గుంటూరు – కృష్ణా జిల్లాల్లోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. తద్వారా, 18 శతాబ్దాల తర్వాత అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది.

రాజధాని పై రాజమౌలితో సంప్రదింపులు

అంతటి చరిత్ర కలిగిన అమరావతి నిర్మాణంలో బాహుబలి2 సినిమాలతో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌలిని భాగస్వామి కానున్నారు..ఆ సినిమాల్లో చూపిన నైపుణ్యం నచ్చే ఇప్పుడు రాజమౌలికి చంద్రబాబు కబురు పంపారు.ఇప్పటికే రాజధాని నిర్మాణం గురించి మంత్రులతో జక్కన్న చర్చలు ముగిసాయి..ముఖ్యమంత్రిని కలిసిన పిదప సిఆర్డీయే స్టాఫ్ తో రాజమౌలి లండన్ వెళ్లనున్నారని సమాచారం.అమరావతి నిర్మాణంపై రాజమౌలి కూడా ఇంట్రస్ట్ చూపుతున్నారని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా..సోషల్ మీడియాలో ఏ పనికోసం ఏ డైరెక్టర్ ని కలిస్తే బాగుంటది అని సరదాగా ఒకటి రాసారు.!

  • మొక్కలు నరకడం, చెట్లు నాటడం – బోయపాటి శ్రీను
  • పల్లెలు అభివృద్ధి చేయడం – కొరటాల శివ
  • బీచ్లు డెవలప్ – పూరి జగన్నాధ్
  • సెట్స్ – గుణశేఖర్
  • ల్యాండ్ మాఫియా అడ్డొస్తే – రామ్ గోపాల్ వర్మ
  • నేరాలు పెరగద్దు అంటే – శ్రీకాంత్ అడ్డాలతో మోటివేషన్ క్లాస్
  • పచ్చదనం, పరిశుభ్రత – మారుతి
  • డిసైన్ – శంకర్
  • సొసైటీ సమస్యలు – శేఖర్ కముల
  • సాఫ్ట్ వెర్ ఆఫీస్ డెవలప్ – సుకుమార్

మన త్రివిక్రమ్ గారిని ఏ ప్రాబ్లెమ్ వస్తే పిలవాలో కామెంట్స్ లో తెలపండి!

Comments

comments

Share this post

scroll to top