హోటల్ లో మనం సగం వాడి వదిలేసిన “సోప్స్” ను ఏం చేస్తారో తెలుసా..? అసలు ఊహించుండరు.!

ఫ్యామిలి అందరం కలిసి ఏదన్నా టూర్ కి వెళ్తాం,అక్కడ రిలేటివ్స్ ఎవరూ లేకపోతే ఏదన్నా హోటల్లో బస చేస్తాం.అక్కడున్నన్ని రోజులు గడిపేసి తిరిగి ఇంటికొచ్చేప్పుడు అక్కడ మనం ఉన్నన్ని రోజులు వాడిన సబ్బులు షాంపూలు మర్చిపోతాం.కొన్ని సార్లు మర్చిపోతాం.చాలా సార్లు ఎందుకు లే అని వదిలేస్తాం.మనం అలా వదిలేసిన సబ్బులు షాంపూలు ఆ హోటల్ వాళ్లు ఏ ం చేస్తారో తెలుసా..తెలుసుకుంటే మాత్రం ఈ సారి ఖచ్చితంగా కావాలని వదిలేసి వస్తారు..

హోటల్లో వదిలేసి వచ్చిన సబ్బుల్ని రీసైక్లింగ్ చేసి పునర్వినియోగానికి ఉపయోగిస్తున్నారు.అవునండీ ఈ ఆలోచన వచ్చింది అమెరికా వారికి..అక్కడ మొత్తం ఉన్న హోటల్ గదులు 4.6మిలియన్ గదులు.ఆ గదులకు వచ్చి వెళ్లే వారు ఖచ్చితంగా అక్కడ పెట్టే సబ్బుని పూర్తిగా వాడరు. సబ్బు ఒకటే కాదు షాంపూ, కండీషనర్ ఇలా అన్ని సగం సగం వాడి వెళ్ళిపోతారు.వస్తువులు చెత్తలోకి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ” క్లీన్ ది వరల్డ్ “ అనే సంస్థ ” గ్లోబల్ సోప్ ప్రాజెక్ట్ “ అనే సంస్థతో జత కట్టింది. అందులో భాగంగా, ఇలా సగం వాడిన సబ్బులను రీసైక్లింగ్ పద్దతిలో పునర్వినియోగించే విధంగా కొత్త సబ్బులను తయారు చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాడుకోవడానికి వినియోగిస్తున్నారు. అలా అవి నిరుపయోగమైన వ్యర్ధాలుగా మిగిలిపోకుండా అరికడుతున్నారు .


ఏ ప్రదేశాలలో అయితే మంచి నీళ్లు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత తక్కువగా ఉందో , అలాంటి ప్రదేశాలలో శుభ్రతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శుభ్రతలేని ప్రదేశాల్లో నిమోనియా మరియు డయేరియా వంటి వ్యాధులు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో సబ్బులు వంటి శుభ్రత ను పెపొందించే వస్తువుల వాడకం వలన వ్యాధులు గణనీయంగా తగ్గుముఖంపట్టే అవకాశం ఉంది.

కొన్ని హోటళ్లు సగం వాడిన అలంకరణ వస్తువులను ఇల్లు లేని స్థానికులకు, స్త్రీల వసతి గృహాలకు మరియు స్వచ్చంద సంస్థలకు దానం చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లు, స్థానికంగా రక్షణ కలిగించే సైన్యానికి, స్థానికంగా ఉన్న చిన్న చిన్న ఆసుపత్రులకు మరియు అనాధ శరణాలయాలకు దానం చేస్తున్నారు.నిజంగా సూపర్బ్ ఐడియా కదా.. మనకు తెలియకుండానే మన నిర్లక్ష్యం వలన మరొకరికి హెల్ప్ చేస్తున్నాం..

Comments

comments

Share this post

scroll to top