అవును..త‌గ్గితే త‌ప్పేంటి..?

ఏముంది గురూ..మ‌హా అయితే విజ‌యం ఎంతో మందితో చ‌ప్ప‌ట్లు కొట్టించేలా చేస్తుందేమో కానీ..ఓట‌మి ఇచ్చినంత మ‌జా..అనుభ‌వం ఇంకేదైనా ఇస్తుందా..అనుకుంటాం ..కానీ ..కాలం ఎన్ని ప‌రీక్ష‌ల‌కు గురి చేస్తుంద‌ని..తెలియ‌కుండానే దాని మాయ‌లో ప‌డిపోతాం. పొద్దు పొడిచిన‌ప్ప‌టి నుండి పొద్దు గూకే దాకా..ఉరుకులు ప‌రుగులు..ఎక్క‌డికి వెళుతున్నామో..దేని కోసం వెదుకుతున్నామో..ఎందు కోసం బ‌తుకుతున్నామో తెలియ‌కుండానే ప్ర‌యాణం చేస్తూనే ఉన్నాం..నిన్న‌టి నుంచి నేటి దాకా. మ‌జిలీ అనుకున్న‌ది మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. భిన్న‌మైన భావాలు..విరుద్ధ‌మైన ఆలోచ‌న‌లు..ప‌ర‌స్ప‌రం ఒక్క‌ట‌వుతున్న‌ట్టు అనిపించినా ఎక్క‌డో ఓ మూల‌న కించిత్ అహం. నాకేమీ అన్న ధీమా..మొహ‌మాటం..ఇవ్వ‌న్నీ మ‌న‌ల్ని ఒక ప‌ట్టాన ఉండ‌నీయ‌వు. మ‌న కేర‌క్ట‌ర్‌ను..మ‌న న‌డ‌త‌ను ..మ‌న ఆలోచ‌నల్ని అవే నియంత్రిస్తాయి..నిర్దేశించే స్థాయికి చేరుకుంటాయి.

ఇక్క‌డే ఆగిపోవాల‌ని అనిపిస్తూ వుంటుంది..కానీ ఉండ‌లేం. ఈ లైఫ్ దేనిని ఓ ప‌ట్టాన అలా ఒకే చోట ఉండ‌నీయ‌దు. అందుకే దానికంత‌టి ప్ర‌త్యేక‌త‌..ప్ర‌తి ఒక్క‌రు అందులోకి రావాల‌ని త‌పిస్తారు. కానీ వ‌చ్చాక ..ఎందుకు దీనిని భ‌రిస్తున్నామో అంటూ లోలోప‌ట మ‌ధ‌న‌ప‌డతాం. స‌క్సెస్ అందుకున్న‌ప్పుడు శ‌రీరం హాయిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ఓట‌మి ప‌ల‌క‌రించిన‌ప్పుడు జీవితంలో ఇంకా ఏదో మిగిలే ఉంద‌న్న ఆశ మిణుకు మిణుకుమంటూ హెచ్చ‌రిస్తుంది. గెలుపు ఓట‌ములు..ఇవ్వ‌న్నీ స‌హ‌జ‌మేగా. దీని కోస‌మేనా మ‌నం కొట్టుకు చ‌స్తున్న‌ది. ఈ క్ష‌ణం కోల్పోతే..ఈ నిమిషాన్ని చేజార్చుకుంటే..లైఫ్‌ను ఎలా అర్థం చేసుకున్న‌ట్టు. అన్నీ వున్న మ‌న‌మే ఏమీ కాకుండా మిగిలి పోతున్నాం. కానీ ప‌శుప‌క్షాదులు..జంతువులు మాత్రం త‌మ‌కు తోచిన‌ట్టు బ‌తుకుతాయి. ఆక‌లేసిన‌ప్పుడు మాత్ర‌మే సంచారం చేస్తాయి. పోరాడుతాయి. అంతిమంగా వాటికీ తెలుసు..ఇదే ఆఖ‌రు అని. అయినా ఎక్క‌డా త‌గ్గ‌వు.

అదే ప‌వ‌ర్..అదే స్పార్క్. ఇలాంటివి చాలా అరుదుగా అగుపిస్తూ వుంటాయి. ఇది కూడా ఓ ఆటే. కావాల‌నుకుంటే మీరూ ట్రై చేసి చూడండి. మీకు అనిపిస్తుంది ..మ‌నలో కూడా ఎక్క‌డో ఒక చోట ..తెలియని ఆట నిక్షిప్త‌మై ఉంది. కానీ దానిని మ‌నం గుర్తించం. అది ఉన్న‌ట్టే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోం. విజ‌యానికి చ‌ప్ప‌ట్లు ఉంటాయి..అప‌జ‌యానికి ..మ‌నం ఒక్క‌ర‌మే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓట‌మి నేర్పే పాఠం ఎంత‌గా ప‌నికొస్తుంద‌ని..ఎంత‌గా మ‌న‌ల్ని రాటు దేలుస్తుందని..అంతులేని శ‌క్తిని..అంత‌ర్గ‌తంగా మ‌న‌సు బ‌ల‌పడేందుకు దోహ‌ద ప‌డుతుంది.
ఈ విష‌యంలో సినిమా డైరెక్ట‌ర్ త్రివిక్రం శ్రీ‌నివాస్ ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఎందుకంటే ఆయ‌న ఎక్కువ‌గా ఓట‌మి గురించి గుర్తు చేస్తారు. అత్తారింటికి దారేది సినిమాకే హైలెట్ సీన్..రైల్వే స్టేష‌న్ ప్లాట్ ఫారం. ఎంఎస్ నారాయ‌ణ …ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పాయింట్ చేస్తూ..ఇంక అమ్మ‌లేని లోటు తీరిపోయిందిరా..ఎక్క‌డ నెగ్గాలో కాదు ఎక్క‌డ త‌గ్గాలో తెలిసినోడు గొప్పోడు..అదే త్రివిక్రం ..జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో తీసిన అర‌వింద స‌మేత‌..సినిమాలో ..యుద్ధం చేసుకుంటూ పోతే..ఏం మిగులుతుంది..పోతే పోయింది..మ‌నం త‌గ్గితే త‌ప్పేంటి ..?

Comments

comments

Share this post

scroll to top