“స్నేహ ఉల్లాల్” సినిమాలకు ఎందుకు దూరమయ్యిందో తెలుసా..? ఓ వ్యాధితో ఇబ్బంది పది ఇప్పుడెలా ఉందంటే..!

కరుణాకరన్ గారి సినిమాల్లో హీరోయిన్లు ఎంతో అందంగా కనిపిస్తారు అనడంలో ఆశ్చర్యమే లేదు. తొలిప్రేమ నుండి ఎందుకంటే ప్రేమంటా దాకా మనకు తెలిసిన విషయమే అది. వైట్ డ్రెస్ లో ఏంజెల్ లాగ కనిపిస్తారు హీరోయిన్లు కరుణాకరన్ సినిమాల్లో. అలా కరుణాకరన్ గారు పరిచయం చేసిన ఒక హీరోయిన్ ను అందరు మొదట్లో “జూనియర్ ఐశ్వర్య రాయి” అని పొగిడేశారు. ఈ పాటికే మీకు అర్ధం అయిపోయి ఉండాలి నేను మాట్లాడేది “స్నేహ ఉల్లాల్” గురించి అని. తరవాత బాలయ్య బాబు సరసన “సింహ” సినిమాలో కథానాయికగా నటించింది. కరెంటు సినిమాతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. వరుడు, అలా మొదలైంది సినిమాల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది స్నేహ ఉల్లాల్. కానీ కెరీర్ ఎంతో పీక్ స్టేజిలో ఉండగా సినిమాలకు దూరమయ్యింది. దీనికి కారణం ఏంటో చూడండి!
ఈ విషయం గురించే ఇటీవలే స్నేహ ఉల్లాల్ గారు జాతీయ వార్త పత్రిక ఇంటర్వ్యూలో  ఏం చెప్పారంటే.
“ఓ వ్యాధి నన్ను ఇన్నిరోజులు సినీ పరిశ్రమకు దూరం చేసింది. రక్తానికి సంబంధించిన ఒక వ్యాధితో బాధ పడ్డాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా నేను మరీ బలహీనంగా మారిపోయాను. నా అంతట నేను కనీసం 30 నిమిషాల పాటు కూడా నిలబడలేకపోయేదాన్ని. దీంతో 2014 వరకు నాకు ఉన్న కమిట్మెట్స్ ను పూర్తి చేసేసి గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు.”
“సినిమాలకు కొన్ని రోజులు విరామమిచ్చి చికిత్స తీసుకున్నా,ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఇది ఇలా ఉండగా ఈ  నాలుగేళ్లు భౌతికంగా నేను బలహీనంగానే ఉన్నా.. మానసికంగా మాత్రం చాలా దృఢంగా ఉన్నాను. పొద్దున్నే ఎక్కువ ఆహారం తీసుకునేదాన్నీ, మధ్యాహ్న వేళల్లో యోగా చేసేదాన్ని,  సాయంత్రం ఎక్కువసేపు జిమ్‌లో గడిపి శారీరకంగా దృఢమయ్యాను.”
ప్రస్తుతం చరణ్‌తేజ్ డైరెక్షన్‌లో “ఆయుష్మాన్ భవ” సినిమాలో నటిస్తున్నానని తెలిపింది.

 

Comments

comments

Share this post

scroll to top