షాంపూల గురించి మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలు ఏమిటో తెలుసా..?

వెంట్రుక‌ల‌ను సంర‌క్షించుకోవాలన్నా, జుట్టు సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గించుకోవాల‌న్నా నేడు అధిక శాతం మంది షాంపూల‌నే వాడుతున్నారు. ఒక‌ప్పుడంటే కుంకుడు పులుసు ఉండేది కానీ ఇప్పుడంతా ఫాస్ట్ యుగం న‌డుస్తుండ‌డంతో ఎవ‌రిని చూసినా షాంపూను వాడేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అయితే షాంపూల‌ను వాడ‌డంలో ప‌లు ప్రాథ‌మిక అంశాల‌ను గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కొంద‌రిలో జుట్టు సంబంధ స‌మ‌స్య‌లు అలాగే ఉంటున్నాయి. దీంతో ఆ స‌మ‌స్య‌ల‌ను ఎలా తొల‌గించుకోవాలో తెలియ‌క అలాంటి వారు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో షాంపూల గురించిన కొన్ని విష‌యాల‌ను మ‌నం తెలుసుకుంటే వాటిని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించేందుకు వీలు క‌లుగుతుంది. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు కూడా పోతాయి. షాంపూల గురించి మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం.

shampoo

1. ఒక్కొక్క‌రు త‌మ ఇష్టానికి అనుగుణంగా ర‌క‌ర‌కాల షాంపూలు వాడుతుంటారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు షాంపూల‌ను మాత్రం మార్చ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే ఒక్కో షాంపూను క‌నీసం 3 నుంచి 4 సార్లు వాడితే త‌ప్ప దాని ఫ‌లితం క‌రెక్ట్‌గా రాద‌ట‌. అందుకే ఒక దాని త‌రువాత ఒక షాంపూను వెంట వెంట‌నే వాడ‌కూడ‌ద‌ట‌. ఒక షాంపూను క‌నీసం 3, 4 సార్లు వాడి అప్పుడు దాని ఫ‌లితం చూశాక వేరే షాంపూకు మారాల‌ట‌.

2. కొంద‌రు షాంపూను త‌ల‌కు అప్లై చేసిన వెంట‌నే నీళ్ల‌తో క‌డిగేస్తారు. అలా చేస్తే అస్స‌లు షాంపూ వాడి కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ట‌. షాంపూను త‌ల‌కు అప్లై చేసుకున్న త‌రువాత కొంత సేపు వెంట్రుక‌ల‌ను, కుదుళ్ల‌ను సున్నితంగా మ‌సాజ్ చేయాల‌ట‌. అలా అయితే షాంపూ క‌రెక్ట్‌గా ప‌నిచేస్తుంద‌ట‌.

3. షాంపూల‌లో ఉండే కొన్ని ర‌కాల ప‌దార్థాలు కేవ‌లం కొంత మందికే ఫ‌లితాన్ని ఇస్తాయ‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు నిమ్మ‌ర‌సం తీసుకుంటే అది కొంద‌రిలో వెంట్రుక‌ల వృద్ధికి తోడ్ప‌డుతుంద‌ట‌. కానీ కొంద‌రిలో మాత్రం అదే నిమ్మ‌ర‌సం జుట్టు కుదుళ్ల‌ను, త‌ల‌పై చ‌ర్మాన్ని ఇరిటేష‌న్‌కు గురిచేస్తుంద‌ట‌. కాబ‌ట్టి ఆయా ప‌దార్థాలు క‌లిసి ఉన్న షాంపూల‌ను వాడాక దాంతో ఫ‌లితం ఉంటేనే ఆ షాంపూను కంటిన్యూ చేయాలి. లేదంటే వేరే షాంపూకు మారిపోవాలి.

4. ఏ షాంపూనైనా క‌నీసం 3, 4 సార్లు వాడితే త‌ప్ప దాని ఫ‌లితం గురించి క‌రెక్ట్‌గా తెలియ‌ద‌ని చెప్పాం క‌దా. అయితే కొంద‌రిలో ఇది ఇంకా ఆలస్య‌మ‌వుతుంద‌ట‌. అలాంటి వారు మ‌రో 2, 3 సార్లు త‌ల‌స్నానం చేసి చూస్తే షాంపూ ప‌నిత‌నం గురించి తెలుస్తుంద‌ట‌.

5. నుర‌గ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని చెప్పి కొంద‌రు ఎక్కువ మొత్తంలో షాంపూను త‌ల‌కు ప‌ట్టిస్తారు. కానీ అలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ట‌. ఎందుకంటే స‌రైన మోతాదులో షాంపూను తీసుకోక‌పోతే అది వెంట్రుక‌ల‌కు ఏ మాత్రం హెల్ప్ చేయ‌ద‌ట‌. కాబ‌ట్టి షాంపూను జుట్టుకు త‌గిన‌ట్టుగా వాడుకోవాలి.

6. ఒక‌ప్పుడంటే ప్రీమియం బ్రాండ్ షాంపూలు, కాస్మొటిక్స్ కొనాలంటే ఏ బ్యూటీ పార్ల‌ర్‌కో, బ్రాండెడ్ స్టోర్‌కో వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడ‌వి ఎక్క‌డ ప‌డితే అక్క‌డే దొరుకుతున్నాయి. ఈ క్ర‌మంలో న‌కిలీ ఉత్పత్తులు కూడా మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. కాబ‌ట్టి ఏదైనా ప్రీమియం బ్రాండ్‌ను కొనుగోలు చేసేముందు ఒక‌టికి రెండు సార్లు చూసి మ‌రీ కొంటే మంచిది. లేదంటే న‌కిలీ ప్రోడ‌క్ట్ వ‌ల్ల మీ జుట్టు ఇంకా డ్యామేజ్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

7. క్లారిఫైయింగ్ షాంపూ పేరిట మార్కెట్‌లో మ‌న‌కు కొన్ని ప్ర‌త్యేక‌మైన షాంపూలు కూడా దొరుకుతున్నాయి. వీటిని అప్పుడ‌ప్పుడు వాడితే జుట్టుకు మ‌రింత సంర‌క్ష‌ణ చేకూరుతుంది.

8. వాతావ‌ర‌ణం ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటుంది కాబ‌ట్టి జుట్టు కూడా వాతావ‌ర‌ణానికి త‌గ్గట్టుగా ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో అందుకు తగిన విధంగా షాంపూను వాడాలి. అంటే నిత్యం జుట్టులో చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టేవారు, లేదంటే నిత్యం ఏసీల్లో గ‌డిపేవారు, వాన‌లో త‌డిసే వారు, ఎండకు ఎండే వారు ఇలా ఆయా వాతావ‌ర‌ణాల‌కు అనుగుణంగా జుట్టును సంర‌క్షించే విధంగా ఉండే షాంపూను వాడాలి.

9. అమ్మోనియం లారిల్ స‌ల్ఫేట్‌, సోడియం లారిల్ స‌ల్ఫేట్ వంటి ప‌దార్థాలు షాంపూల్లో ఉంటే ఆ షాంపూల‌ను వాడ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే ఇవి మ‌న జుట్టుకు హాని చేస్తాయ‌ట‌.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top