ఇకమీద‌ట రైళ్లు ప‌ట్టాలు త‌ప్ప‌వు, ట్రైన్ యాక్సిడెంట్స్ జ‌ర‌గ‌వు.! ఎందుకో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో మ‌న దేశంలో రైలు ప్ర‌మాదాలు ఎలా జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. దాదాపుగా అన్నీ ప‌ట్టాలు త‌ప్ప‌డం వ‌ల్ల జ‌రిగిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ రైల్వే వారు ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా ఎలాంటి చర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌యాణికులు రైళ్ల‌లో ప్ర‌యాణించాలంటేనే జంకుతున్నారు. అయితే ఇది స‌రే. అస‌లు మ‌నం టెక్నాల‌జీలో దూసుకుపోతున్నామ‌ని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం, మ‌రి అలాంటిది రైలు ప్రమాదాల‌ను నివారించ‌డంలో ఎందుకు టెక్నాల‌జీని వాడుకోలేక‌పోతున్నాం..? అంటే అవును, అందుకు కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే…

రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు, ప్ర‌యాణికులకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం కోసం మ‌న దేశంలో అనేక చోట్ల అనేక సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా Technology Mission on Railway Safety & Zero Accident Mission అనే కార్య‌క్ర‌మం ద్వారా భార‌త ప్ర‌భుత్వం రైలు ప్ర‌మాదాల నివార‌ణ కోసం ఉపయోగ‌ప‌డే కొత్త టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తోంది. ఇక దీంతోపాటు ఐఐటీ మ‌ద్రాస్‌లో automatic fracture detection system అనే ప‌రిజ్ఞానాన్ని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఇది రైలు ప‌ట్టాల స్థితి గ‌తులు, అవి ఎలా ఉన్నాయి వంటి అంశాల‌ను తెలుసుకునేందుకు ప‌నికొస్తుంది.

ఇవే కాకుండా Derailment Detection Devices అనే టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. దీంతో ట్రెయిన్‌లో సెన్సార్ల‌ను అమర్చ‌డం ద్వారా ప‌ట్టాల కండిష‌న్ తెలుస్తుంది. దీంతోపాటు HABD Systems (Hot Axle & Box Detection) అనే మ‌రో విధానాన్ని కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఇది కూడా ప‌ట్టాల స్థితిని తెలుసుకునేందుకు ప‌నికొస్తుంది. అయితే దీన్ని బోగీల్లోనే నేరుగా ఏర్పాటు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇన్ని టెక్నాల‌జీలను పెట్టుకుని కూడా రైలు ప్ర‌మాదాలు త‌ర‌చూ జ‌రుగుతున్నాయంటే… ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పైన చెప్పిన అన్ని టెక్నాల‌జీలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కొన్ని ట్ర‌య‌ల్ ద‌శ‌లో ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే వాటి అభివృద్ధికి నిధులు ఖ‌ర్చు చేయాలి. అక్క‌డే అస‌లు స‌మ‌స్యంతా వ‌స్తోంది. ఇక ఈ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్‌మెంట్స్‌ ఎప్పుడు పూర్త‌వుతాయో, రైలు ప్ర‌మాదాల నివార‌ణ చ‌ర్య‌లు ఎప్ప‌టి నుంచి ప్రారంభిస్తారో మ‌న ప్ర‌భుత్వాల‌కే తెలియాలి..!

Comments

comments

Share this post

scroll to top