కథలకు ఆహ్వానం….. టాలెంట్ మీది,వేదిక మాది.

మీలో మంచి రైటర్ దాగున్నాడా? మీరు రాసిన కథ అచ్చయితే చూసుకోవానుకుంటున్నారా? ఎన్ని మంచి  కథలు రాస్తున్న పేపర్ వాళ్లు రిజెక్ట్ చేస్తున్నారా?  అర్థం లేని షరతులు పెట్టి మీ కథలను అచ్చుకాకుండా అడ్డం పడుతున్నారా.? అయితే ఈ అవకాశం మీకోసమే…మీలోని  క్రియేటివ్   రైటర్ ని నిద్రపోనివ్వకండి, తట్టిలేపండి….మీ కథలను మాకు రాసి పంపండి. మా వెబ్ సైట్  ద్వారా మేము మీ టాలెంట్ ను బయటిప్రపంచానికి   తెలియజేస్తాము. మీ క్రియేటివిటికి నెటీజన్ల చే శభాష్ అనిపిస్తాము. ఏమో ఈ వేదిక  ద్వారానే మీకు మంచి అవకాశం రావొచ్చేమో, సినిమాల్లో స్టోరీ రైటర్లుగా ఎదిగిపోవొచ్చేమో .! ఓ ప్రయత్నం అయితే చేసి చూడండి…ఫలితం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా.! కథ మంచిదైతే అంతకు మించిన అవకాశాలను అదే మన దగ్గరికి తీసుకువస్తుంది.

సరదాగా కథలు రాసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఓ మంచి వేదిక, తమ రచనలను ఎక్కువ మంది చేత చదివించేందుకు ఇదో మంచి ఫ్లాట్ ఫామ్. కథ ఇలా ఉండాలి,అలా ఉండాలి అన్న కండీషన్లు ఏం లేవు…మీ ఇష్టం, మీ పెన్ ఇష్టం…కానీ వ్యూయర్స్ ని  ఆకట్టుకునే లా, ఆసాంతం చదివించేలా… ఇంట్రస్టింగ్ గా  ఉండాలి. అలా అయితేనే కదా…మనం రాసిన  కథకు విలువ, మన టాలెంట్ కు ప్రశంస. అందుకే చదివించే దమ్ము కథలో ఉండాలి.

 

కథలే కాదు, మీ నిజజీవితంలో సంబవించిన స్టోరీలను, మీరు ఎదుర్కొన్న కష్టాలను, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో దాగున్న విశేషాలను కూడా రియల్ స్టోరీ పేరుతో మాతో పంచుకొనే ఛాన్స్ ఉంది. మానవత్వాన్ని తట్టిలేపే ప్రతి విషయం గురించి మీరు మాతో షేర్ చేసుకోవొచ్చు. మీ రచనలను మీ పేరు , ఫోన్ నెంబర్లలతో( మీకు ఓకే అయితే)  సహా ప్రచురిస్తాం. అంతే కాదు వారానికి ఒక్క కథకు “The Best Story” కింద 500/- రూపాయలను ప్రోత్సాహక బహుమతిగా అందిస్తాం.

ఛలో….షురు కరో..!  మీలోని కథకుడిని తట్టిలేపండి…

కండీషన్స్:

  • కథ ఏదైనా  పాఠకుడిని చదివించేది అయి ఉంటే చాలు….ఏ జానర్ అయిన ఓకే.
  • కాపీ కథలను పంపకండి.

మా మెయిల్ :  ap2tgtelugu@gmail.com

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top