పెళ్లి ఆగిపోయింది.. అదికూడా రెండు రసగుల్లాల కోసం !! వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా !!

సాధారణంగా వరకట్నం సమస్య లేదా పెళ్లి ఇష్టంలేక వరుడు లేదా వధువు పరారైతే వివాహాలు ఆగిపోతుంటాయి. కొన్ని సార్లు కొన్ని వింత కారణాల వల్ల కూడా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకే చెందినది. ఇటీవల ఒక వివాహం రసగుల్లాల వల్ల అయిపోయింది.. కారణం వింతగా ఉంది కదా కానీ ఇది నిజం.. ఇంకా వివరాలు తెల్సుకోవాలి అంటే మొత్తం చదవాల్సిందే..

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో కుర్మాపూర్‌లోని ఒక పెళ్లి రసగుల్లాల వల్ల ఆగిపోయింది. ఓ పెళ్లి వేడుక జరుగుతుండగా, డిన్నర్ ప్రారంభం అయ్యింది. ఈ డిన్నర్‌‌ను బఫే పద్ధతిలో ఏర్పాటు వధువు కుటుంబీకులు ఏర్పాటు చేశారు. డిన్నర్ మెనూలో రసగుల్లా కూడా ఉంది. అయితే రసగుల్లా మనిషికి ఒకటే ఇవ్వాలనే నియమం పెట్టారు వధువు తరపు బంధువులు. అయితే వరుడి కుటుంబీకులో ఒక్కరు మాత్రం రెండేసి రసగుల్లాలను తీసేసుకున్నారు. అక్కడే సమస్య మొదలైంది. ఈ రసగుల్లా సమస్యే పెను వివాదానికి దారితీసింది.

ఇరు తరపు బంధువులు నువ్వా నేనా అంటూ కొట్టుకోవడంతో.. డిన్నర్ జరిగిన ప్రాంతమే రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనను వధువు కళ్లారా చూస్తుండిపోయింది. అయినా తల్లిదండ్రులను వరుడు తరపు బంధువులు తీవ్రంగా అవమానించడమే కాకుండా కొట్టడం చూసి సహించలేకపోయింది. అంతే ఈ వివాహం వద్దే వద్దని వధువు నిర్ణయించుకుంది. దీనిపై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top