వారంలో ఏ రోజు ఏ ర‌కం ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మంచిదో తెలుసా..?

ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డ‌మంటే మ‌హిళ‌ల‌కే కాదు, కొంద‌రు పురుషుల‌కు కూడా ఇష్టంగానే ఉంటుంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఎప్పుడూ త‌మ వ‌ద్ద ఉన్న ఆభ‌ర‌ణాల‌ను మార్చి మార్చి ధ‌రిస్తుంటారు. కొంద‌రైతే ఎప్ప‌టికీ ఒకే ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తారు. కానీ మీకు తెలుసా..? వారంలో ఏడు రోజులు ఉన్న‌ట్టే ఆ ఏడు రోజుల‌కు ఆయా న‌వ గ్ర‌హాలు అధిప‌తులుగా ఉంటాయ‌ట‌. దీన్ని దృష్టిలో ఉంచుకుని పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఎప్ప‌టికీ ఒకే లాంటి బంగారు ఆభ‌ర‌ణాల‌ను కాకుండా ఆయా గ్ర‌హాల‌కు అనుకూలంగా 7 రోజుల‌కు గాను వివిధ ర‌కాల ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌ట‌. అప్పుడే శుభం జ‌రుగుతుంద‌ట‌. కోరుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే రోజున ఏయే ర‌కం ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

types-of-stones

ఆదివారం…
ఆదివారం సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున కెంపులతో చేసిన నగలు, చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చు.

సోమ‌వారం…
చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజుది. ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు, హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యంలో విజయం చేకూరుతుంది.

మంగ‌ళ‌వారం…
కుజ గ్రహానికి ఇష్టమైన రోజిది. ఈ రోజు పగడాలతో చేసిన ఆభరణాలు, దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతి బాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.

బుధవారం…
బుధ గ్ర‌హానికి ప్రీతికరమైన రోజు. పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధి కుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.

గురువారం…
బృహస్పతి (గురు భగవానుడు)కి ఇష్ట‌మైన రోజు ఇది. పుష్యరాగంతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధి వంటి ఫలితాలుంటాయి.

శుక్రవారం…
శుక్రునికి ఇష్ట‌మైన రోజు. వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మి దేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.

శనివారం…
శ‌నిగ్ర‌హానికి ఇష్ట‌మైన రోజు. నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Comments

comments

Share this post

scroll to top