కోపం తో రగిలిపోతున్న భారతీయులు. అందరూ ఒక్కటయ్యారు, పాక్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.!!

పుల్వామా ఉగ్రవాద దాడిలో 46 మంది CRPF జవానులు మృతి చెందారు, ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ సంఘటన లో చాలా మంది జవానులు గాయపడ్డారు, కాశ్మీర్ కి చందిన 22 ఏళ్ళ కుర్రాడు జవానులు వెళుతున్న ట్రక్ కి ఎదురుగా కారు తో వెళ్లి తనని తాను కారు తో సహా పేల్చుకుని 46 మంది జవానులను బలిగొన్నాడు, ఈ కుర్రాడు పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాద సంస్థ అయిన జైష్-ఈ-మొహమ్మద్ కి సంబందించిన వాడు, దాడి జరిగిన వెంటనే దాడికి పాల్పడిన కుర్రోడి వీడియో ని విడుదల చేసారు జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం పాకిస్తాన్ నుండే కార్యకలాపాలు సాగిస్తుంది, ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ సంస్థ ద్వారా జవానులు పైన ఉగ్ర దాడి జరిపిందని అందరు గట్టిగా నమ్ముతున్నారు.

ప్రతీకారం కావాలి.. :

ఈ సంఘటన తరువాత భారతీయులు అందరు ఏకమయ్యారు, పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సింది గా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు, మన దేశ ప్రధాన మంత్రి మోడీ గారు ఇండియన్ ఆర్మీ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఖచ్చితంగా పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటాం అని మోడీ గారు కూడా చెబుతున్నారు.

సహకరించిన అమెరికా, రష్యా.. :

భారత ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తాం అని అమెరికా, రష్యా, యూకే దేశాలు తెలిపాయి, పాకిస్తాన్ చర్యల పైన కోపాన్ని వ్యక్తపరిచారు, పాకిస్తాన్ వెన్నంటే నిలిచిన చైనా పైన కూడా మనోళ్లు కోపం గా ఉన్నారు. పాకిస్తాన్ ని మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రతి ఒక్క రాజకీయనాకుడు చెబుతున్నాడు. జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను అంతమొందించటానికి మనవాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, ఈ సారి మనోళ్లు కొట్టే దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళు మన జోలికి రావాలంటేనే భయపడేలా చెయ్యాలి అని అందరు కోరుకుంటున్నారు.

హ్యాకింగ్ నుండి ప్రధాన మంత్రి పేజి లో మనోళ్ల మింగుడు వరకు.. :

పాకిస్తాన్ ఫేస్బుక్ బడా గవర్నమెంట్ పేజెస్ నుండి వెబ్సైట్స్ వరకు హ్యాక్ చేస్తున్నారు మనోళ్లు, ఇక పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ పేజి లో మనోళ్లు మామూలు రచ్చ చెయ్యట్లేదు, మాములు తిట్ల నుండి పచ్చి బూతుల వరకు తిట్టి పడేస్తున్నారు, ఇండియన్స్ వి ఎన్ని కామెంట్స్ డెలీట్ చేసినా మనోళ్లు మాత్రం పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల యువత పాకిస్తాన్ ప్రధాని ఫేస్బుక్ అకౌంట్ లో అతగాడిని మామూలుగా ఆటాడుకోవట్లేదు. ‘మా RTC X Roads పార్కింగ్ కలెక్షన్స్ అంత ఉండదు మీ పాకిస్తాన్ బడ్జెట్, మీకెందుకు రా మాతో *బీప్*’ ఇలాంటి కామెంట్స్ తో పాకిస్తాన్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మంది పాకిస్తాన్ పైన ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top