జ‌న‌వ‌రి 27వ తేదీ నాడు అంద‌రూ మౌనంగా ఉండాల‌ట‌… అస్స‌లు మాట్లాడ‌కూడ‌ద‌ట‌.!?

మౌన వ్ర‌తం చేస్తే శుభం క‌లుగుతుంద‌ని భావించి మ‌న‌లో కొంద‌రు దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పాటిస్తుంటారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు ఈ వ్ర‌తాన్ని ఎక్కువ‌గా చేస్తుంటారు. అయితే మౌన వ్ర‌తం చేయ‌డ‌మనేది వారి వారి విశ్వాసాల‌ను, ఇష్టాల‌ను బ‌ట్టి వ్య‌క్తిగ‌తంగా ఉంటుంది. ఎవ‌రి ఇష్ట ప్ర‌కారం వారు దీన్ని చేస్తారు. కానీ రానున్న జ‌న‌వ‌రి 27వ తేదీన మాత్రం వ్య‌క్తిగ‌తంగా కాకుండా అంద‌రూ మౌన వ్ర‌తం చేయాల్సిందేన‌ట‌. ఆ రోజు మాట్లాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ట‌. లేదంటే అంద‌రూ క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంద‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. శ్రీనివాస గార్గే అనే ఓ సిద్ధాంతి చెబుతున్న మాట‌లు. ఇంత‌కీ ఆయ‌న అలా ఎందుకు చెబుతున్నాడో తెలుసా..?

srinivas-garge
ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అయితే ఈ అమావాస్య ఈ సారి జ‌న‌వ‌రి 27వ తేదీన వస్తుంద‌ట‌. దీంతోపాటు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్ 26న సహజ గమనంతో ధనుస్సు రాశిలోకి ప్రవేశించాల్సి ఉందని, కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గే తెలిపారు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్‌ 21వ తేదీకి చేరుకుంటుందని, వృశ్చికరాశిలో కొంతకాలంపాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్‌ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందని, అందువల్ల 2017వ సంవత్సరం అంత శుభప్రదమైనది కాదని గార్గే వెల్లడించారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 27వ తేదీన వ‌స్తున్న మౌని అమావాస్య ఇత‌ర అమావాస్య‌ల‌లా కాకుండా స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టే అమావాస్య‌గా వ‌స్తుంద‌ని, అందుకే ఆ రోజు అంద‌రూ మౌన వ్ర‌తం చేయాల‌ని గార్గే చెబుతున్నారు.

అయితే రోజంతా మాట్లాడ‌కుండా ఉండ‌లేమ‌నే వారు క‌నీసం ఆ రోజున ఉద‌యం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని గార్గే అంటున్నారు. అలా కాకుండా ఎవ‌రైనా మాట్లాడితే దాంతో మ‌రుస‌టి రోజు నుంచి వారికి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్నారు. కాగా నోట్ల ర‌ద్దు స‌మ‌స్య‌లు 2018 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని, 2017లో భూకంపాలు, విమాన ప్రమాదాలు ఎక్కువ‌గా సంభ‌విస్తాయ‌ని గార్గే అంటున్నారు. అటు కేంద్ర ప్ర‌భుత్వానికి, ఇటు ఏపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని, చంద్ర‌బాబు ఆరోగ్యంగానే ఉంటాడ‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రి ఈ విష‌యాలు నిజంగా జ‌రుగుతాయో లేదో వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top