ఫ్లూ జ్వరం, జలుబులను తగ్గించే టెక్నిక్….కాలిన గాయాలకు, వెన్ను నొప్పులకు కూడా చక్కని పరిష్కారానిస్తుంది.

అల్యూమినియం ఫాయిల్ గురించి తెలుసుగా… రోటీలు, క‌బాబ్‌లు, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను చుట్టి పెట్ట‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. క‌ల‌ర్ దాదాపుగా ఒకే ర‌కంగా ఉండ‌డం వ‌ల్ల చాలా మంది దీన్ని సిల్వ‌ర్ ఫాయిల్ అని కూడా అంటారు. కానీ సిల్వ‌ర్‌తో త‌యారు చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది క‌దా. అందుకే అల్యూమినియంతో ఫాయిల్స్ త‌యారు చేస్తారు. ఇవి ఆహార ప‌దార్థాల‌ను వేడిగా ఉంచ‌డ‌మే కాదు, ఆ ప‌దార్థాల‌కు క్రిములు, బాక్టీరియా చేర‌కుండా ర‌క్ష‌ణ‌నిస్తాయి. అందుకే వాటిని ఆహార ప‌దార్థాల‌ను చుట్ట‌డంలో వాడుతారు. అయితే కేవ‌లం ఆహార ప‌దార్థాల సంర‌క్ష‌ణ కోస‌మే కాదు, అల్యూమినియం ఫాయిల్స్‌తో మ‌న‌కు ఇంకా ఇత‌ర ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

aluminium-foil

1. ఫ్లూ జ్వ‌రం, జ‌లుబు బాధిస్తుంటే 5 నుంచి 7 అల్యూమినియం ఫాయిల్స్‌ను తీసుకుని పాదాల‌కు చుట్టాలి. అనంత‌రం వాటిని ఒక గంట పాటు అలాగే వ‌దిలేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫ్లూ జ్వ‌రం, జ‌లుబు స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే గంట సేపు అల్యూమినియం ఫాయిల్స్ ఉంచిన త‌రువాత వాటిని తీసి మ‌ళ్లీ 2 గంట‌లు ఆగాక అలాగే చుట్టి ఉంచాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా విముక్తి ల‌భిస్తుంది.

2. శ‌రీరంలో కాలిన గాయాలు ఉంటే వాటిపై అల్యూమినియం ఫాయిల్‌ను వేసి క‌ట్టు కట్టాలి. అదే వేళ్లు కాలితే వాటికి అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టాలి. దీన్ని కొంత సేపు అలాగే ఉంచి తీసేయాలి. మ‌ళ్లీ కొద్ది స‌మ‌యం ఆగాక అలాగే ఫాయిల్‌ను చుట్టాలి. దీంతో కాలిన గాయాలు త్వ‌ర‌గా మానుతాయి.

3. ఒక అల్యూమినియం ఫాయిల్‌ను తీసుకుని దాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను ముఖంపై ఉంచాలి. దీంతో మ‌న‌స్సుకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. ప్ర‌శాంతంగా ఉంటుంది. ముఖం కూడా కాంతివంతంగా, తాజాగా మారుతుంది.

aluminium-foil

4. న‌డుం, మెడ‌, మోకాళ్లు, వెన్నెముక‌, భుజాల నొప్పులు ఉంటే వాటిపై అల్యూమినియం ఫాయిల్‌ను క‌ట్టులా క‌ట్టి కొంత సేపు ఉంచాలి. దీంతో ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. ఒక పాత్ర‌లో చ‌ల్ల‌ని నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక అల్యూమినియం ఫాయిల్‌ను వేయాలి. దాంట్లో వెండి పాత్ర‌ల‌ను వేసి 3 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో వెండి సామాన్లు త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

6. ఇంట్లో గిన్నెలు తోముకునే సాధార‌ణ స్క్ర‌బ్బ‌ర్‌కు బ‌దులుగా అల్యూమినియం ఫాయిల్‌ను ఉప‌యోగిస్తే గిన్నెలు బాగా శుభ్ర‌మై మెరుస్తాయి.

Comments

comments

Share this post

scroll to top