నిత్యం అండ‌ర్‌వేర్‌ను మార్చ‌క‌పోతే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసుకోండి..!

ఎవ‌రు ఎలాంటి దుస్తులు ధ‌రించినా ప్ర‌తి ఒక్క‌రు కామ‌న్‌గా వేసుకునేది మాత్రం ఒక‌టుంటుంది. అదే అండ‌ర్ వేర్‌. అంటే కొంత మంది దీన్ని వాడ‌రు లెండి. అది వేరే విష‌యం. అలాంటి వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అండ‌ర్‌వేర్ వేసుకునే వారు మాత్రం నిత్యం దాన్ని మార్చాల‌ట‌. ఎందుకో తెలుసుకుందాం రండి.

1. ఒక రోజు వేసుకున్న అండ‌ర్‌వేర్‌ను మ‌రొక రోజు ధ‌రించ‌కూడ‌దు. క‌చ్చితంగా మార్చాలి. లేదంటే జ‌న‌నావ‌య‌వాల ద‌గ్గ‌ర ఉండే బాక్టీరియా శ‌రీరంలోని ఇత‌ర ప్ర‌దేశాల‌కు వ్యాప్తి చెందుతుంది. దీంతో వేరే అనారోగ్యాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

2. రోజూ అండ‌ర్‌వేర్‌ను మార్చ‌క‌పోతే చ‌ర్మం ఇర్రిటేష‌న్‌కు గుర‌వుతుంది. దీంతో చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌ధానంగా చ‌ర్మానికి అల్స‌ర్ సోకే అవ‌కాశం ఉంటుంది.

3. అండ‌ర్‌వేర్‌ను నిత్యం మార్చ‌క‌పోతే స్నానం చేసినా పెద్ద ఫ‌లితం ఉండ‌దు. ఎందుకంటే బాక్టీరియా అలాగే ఉంటుంది. దీనికి తోడు ప్రైవేట్ పార్ట్స్ వద్ద దుర్వాస‌న వ‌స్తుంది.

underwear

4. శారీరక శ్ర‌మ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసే వారు ఆ ప‌ని చేశాక క‌చ్చితంగా అండ‌ర్ వేర్‌ను మార్చుకోవాలి. లేదంటే చెమ‌ట కార‌ణంగా చ‌ర్మంపై రాషెస్ వ‌స్తాయి. అంతేకాకుండా అక్క‌డ బాక్టీరియా కూడా ఎక్కువ‌గా చేరుతుంది.

5. కేవ‌లం ప్యూర్ 100 శాతం కాట‌న్‌తో త‌యారు చేసిన అండ‌ర్‌వేర్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించాలి. నైలాన్ వంటి ప‌దార్థంతో చేసినవి వాడితే స్కిన్ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

6. నిత్యం అండ‌ర్‌వేర్‌ను మార్చ‌క‌పోతే బాక్టీరియా పెరిగిపోతుంద‌ని చెప్పాం క‌దా. ఆ… అదే బాక్టీరియా యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను కూడా క‌లిగిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో మూత్రం పోసేట‌ప్పుడు మంట‌, నొప్పి క‌లుగుతాయ‌ట‌. కాబ‌ట్టి రోజూ అండ‌ర్‌వేర్‌ను మార్చాల్సిందే.

rihctblxdihvdufd0wgm

7. ఒక‌టే అండ‌ర్‌వేర్‌ను రోజూ వేసుకుంటే చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌చ్చి దుర‌ద పెడుతుంది. చ‌ర్మ వ్యాధులు సోకుతాయి. ఒక్కో సారి చ‌ర్మం వాపుకు కూడా గుర‌వుతుంది.

8. అండ‌ర్‌వేర్‌ను నిత్యం మార్చ‌క‌పోతే ఈస్ట్ ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌తారు. ఇది చ‌ర్మానికి చాలా హాని క‌లిగిస్తుంది. కాబ‌ట్టి నిత్యం ప‌రిశుభ్ర‌మైన అండ‌ర్‌వేర్‌ను వేసుకోవాలి. ఒక రోజు వేసుకున్న అండ‌ర్‌వేర్‌ను రెండో రోజు వాడ‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top