మ‌హిళ‌లు న‌డిచే న‌డ‌క‌తోనే వారి శృంగార శ‌క్తి గురించి చెప్ప‌వ‌చ్చ‌ట తెలుసా..?

సైంటిస్టులు అంటే ఊరుకోరు క‌దా. ఎప్పుడూ ఏదో ఒక ప్ర‌యోగం, ప‌రిశీల‌న చేస్తూనే ఉంటారు. అయితే మ‌రి తాజాగా కొంద‌రు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న ఏంటో తెలుసా..? ఎలాంటి న‌డ‌క తీరు ఉన్న మ‌హిళ‌లు శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు..? అనే విష‌యంపై వారు ప‌రిశోధ‌న‌లు చేశారు. అవును, ఆశ్చ‌ర్య‌ప‌రిచే విధంగా ఉన్నా, వారి ప‌రిశోధ‌న గురించి తెలిస్తే మీరు ఇంకా ఎక్కువ షాక్ అవుతారు. స్కాట్లండ్ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ సైంటిస్టు బృందం ఈ ప‌రిశోధ‌న చేసింది.

ఆ సైంటిస్టులు మొద‌ట భిన్న ర‌కాల న‌డ‌క తీరు, అవ‌య‌వ సౌష్ట‌వం ఉన్న మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్న‌లు అడిగారు. అవి ఎక్కువ‌గా ఎలా ఉన్నాయంటే… శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంది, అవ‌త‌లి పార్ట్‌న‌ర్ సంతృప్తి చెందుతాడా ? అన్న రీతిలో వారు కొంద‌రు మ‌హిళ‌లను ప్ర‌శ్న‌లు అడిగారు. ఆ త‌రువాత వారు న‌డిచే విధానాన్ని షూట్ చేశారు. ఈ క్ర‌మంలో వారు చెప్పిన స‌మాధానాల‌ను, న‌డ‌క తీరు దృశ్యాల‌ను స‌రిపోల్చారు. ఇక త‌రువాత ఆ సైంటిస్టు బృందం మ‌ళ్లీ ఏం చేసిందంటే… లైంగిక విజ్ఞానంపై అవ‌గాహ‌న లేని కొంద‌రు పురుషుల‌ను శృంగారం గురించిన ప‌లు ప్ర‌శ్న‌లు అడిగింది. మ‌హిళల అవ‌య‌వ సౌష్ట‌వం, న‌డ‌క‌తీరును చెబుతూ ఆ ల‌క్ష‌ణాలు క‌లిగిన వారు శృంగారంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు అని వారు పురుషుల‌ను ప్ర‌శ్న‌లు అడిగారు.

ఆ త‌రువాత పైన మ‌హిళ‌ల ద్వారా వచ్చిన ఫ‌లితాల‌ను, పురుషుల ద్వారా వ‌చ్చిన ఫ‌లితాల‌ను విశ్లేషించారు. దీంతో వారు ఏం చెబుతున్నారంటే.. న‌డుమును వయ్యారంగా తిప్పుతూ న‌డిచేవారు లేదా అవ‌య‌వ సౌష్టవం బాగా ఉన్నవారు (అవ‌య‌వాలు పుష్టిగా ఉన్న‌వారు) శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటార‌ని అంటున్నారు. మ‌హిళ‌లు న‌డిచే న‌డ‌కతీరే వారి శృంగార ప్ర‌వ‌ర్త‌న‌, తృష్ణ‌, శ‌క్తిల గురించి చెబుతుంద‌ని వారు అంటున్నారు. ఇక దీంతోపాటు వారు ఏమ‌ని అంటున్నారంటే.. కండ‌రాలు దృఢంగా ఉన్న మ‌హిళ‌లు శృంగారంలో యాక్టివ్‌గా ఉంటార‌ని, వారి క‌టి భాగం చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఏది ఏమైనా.. ఆ సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న చిత్రంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top