నిత్య జీవితంలో చేసే ఈ 5 ప‌నులను బ‌ట్టి ఎవ‌రి వ్యక్తిత్వాన్న‌యినా చెప్ప‌వ‌చ్చు తెలుసా..?

స‌మాజంలో ఉండే ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి త‌నదైన వ్య‌క్తిత్వం ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవ‌రైనా ప్ర‌వ‌ర్తిస్తారు. ఏదైనా నిర్ణ‌యం తీసుకోవ‌డంలో, ఇత‌రుల ప‌ట్ల ప్రేమ‌ను, ఆప్యాయ‌త‌ను, జాలిని క‌న‌బ‌ర‌చ‌డంలో, స్వార్థం విష‌యంలో, ఇంకా అనేక అంశాల విష‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. అయితే దాన్ని తెలుసుకోవాలంటే ఎవరైనా వ్య‌క్తికి చెందిన ఈ అల‌వాట్ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే చాలు. దాంతో ఏ వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం, వ్య‌క్తిత్వ‌మైనా ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఇత‌రుల‌లో మ‌నం ప‌రిశీలించాల్సిన వారి అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఇత‌రుల వ్య‌క్తిత్వాన్ని తెలుసుకోవాలంటే వారు భోజ‌నం ఎలా చేస్తారో ఓసారి ప‌రిశీలించాలి. అంటే వారు.. చాలా నెమ్మ‌దిగా ఆహారం తినే వారు అయితే వారికి ఆహారం అన్నా, జీవితం అన్నా చాలా మ‌క్కువ ఉంటుంది. ఎప్పుడూ జీవితంలో కొత్త విష‌యాల‌ను కోరుకుంటారు. ప్ర‌తి విష‌యాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఇక చాలా వేగంగా తినేవారు అయితే అలాంటి వారికి స‌హ‌నం, ఓపిక త‌క్కువ‌గా ఉంటాయి. వీరికి ఆశ ఎక్కువ‌. ఎప్పుడూ కొత్త ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాల‌ని కోరుకుంటారు. ఇక కొత్త వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డేవారు అయితే వారికి సాహ‌సాలు చేయాల‌నే వ్య‌క్తిత్వం ఉంటుంది. ఏ విష‌యంలో అయినా రిస్క్ చేయాల‌ని చూస్తారు.

అలాగే భోజ‌నాన్ని సుతారంగా చేసేవారు ఆందోళ‌న‌క‌ర మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటారు. ఎప్పుడూ ఇన్‌సెక్యూర్‌గా, న‌ర్వ‌స్‌గా ఫీల‌వుతుంటారు. అదేవిధంగా అన్ని ఆహారాల‌ను క‌లుపుకుని భోజ‌నం చేసే వారు ఒకేసారి ఎక్కువ పనులను చేసేందుకు ఇష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్ని క‌లిగి ఉంటారు. ఇక ఆహారాల‌ను క‌ల‌ప‌కుండా వేర్వేరుగా తినేవారు జీవితంలో ప్ర‌తి విషయం ప్లాన్డ్‌గా జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. వీరికి కొత్త ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డ‌డం కొంత క‌ష్టంగా ఉంటుంది.

2. టీ, కాఫీ లేదా పాల‌ను క‌ప్పులో తాగే వారు ఆ క‌ప్పును ప‌ట్టుకునే విధానంపై కూడా వారి వ్య‌క్తిత్వం ఆధార ప‌డి ఉంటుంది. స‌ద‌రు డ్రింక్స్‌ను తాగేట‌ప్పుడు ఎప్పుడూ క‌ప్పులోప‌లికి చూసే వారు జీవితంపై ఒక స్థిర‌మైన అభిప్రాయాన్ని క‌లిగి ఉండే వ్య‌క్తులుగా మెలుగుతారు. అలాగే డ్రింక్స్‌ను తాగేట‌ప్పుడు క‌ప్పు చివ‌ర్ల‌ను చూస్తుంటే అలాంటి వారు ఇత‌రుల‌ను సుల‌భంగా న‌మ్మేవారు అయి ఉంటారు. ఎప్పుడూ హ్యాపీగా ఉండేందుకే ఆలోచిస్తారు. ఇత‌రులు ఏ అంశంపై అభిప్రాయం అడిగినా స‌మాధానం ఇచ్చేంత స‌మ‌ర్థులుగా ఉంటారు.

3. ఎవ‌రైనా స్నానం చేసే తీరును బ‌ట్టి కూడా వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు. గంట‌ల త‌రబ‌డి స్నానం చేసేందుకు ఇష్ట‌ప‌డేవారు జీవితంలో వ‌చ్చే ఆటు పోట్ల‌కు అంత త్వ‌ర‌గా భ‌య‌ప‌డ‌రు. వీరు చాలా కామ్ గా, రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటారు. లైఫ్‌ను టేక్ ఇట్ ఈజీ అన్న‌ట్లుగా తీసుకుంటారు. ఇక స్నానం చేసేట‌ప్పుడు పాట‌లు పాడేవారు సామాజిక సేవా బాధ్య‌త‌ను క‌లిగి ఉంటారు. స్నేహితులు, ఇత‌రుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇక స్నానం వేగంగా చేసేవారు ఇత‌రుల సంర‌క్ష‌ణ ప‌ట్ల బాధ్య‌తగా ఉంటారు. అంద‌రి ప‌ట్ల కేర్ తీసుకునే వారుగా ఉంటారు. అలాగే స్నానం చేసేట‌ప్పుడు షేవింగ్‌, బ్ర‌షింగ్ వంటివి చేసేవారు జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకే ఇష్ట‌ప‌డే వారుగా ఉంటారు.

స్నానం చేసేట‌ప్పుడు స్పాంజ్ వాడేవారు జీవితంలో ఎదుర‌య్యే ఎలాంటి సంఘ‌ట‌న‌ను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక ఎప్పుడూ చ‌ల్ల‌ని నీటితోనే స్నానం చేసేందుకు ఇష్ట‌ప‌డేవారు త్వ‌ర‌గా కోపం వ‌చ్చే స్వ‌భావం క‌లిగి ఉంటారు. వీరికి ఇత‌రుల‌తో వాద‌న పెట్టుకోవ‌డం అంటే స‌ర‌దా. త‌మ వాద‌న క‌రెక్ట్ అని నిరూపించుకునేందుకు చివ‌రి వ‌ర‌కు వాదిస్తారు. అలాగే స్నానం చేసేట‌ప్పుడు క‌ల‌లు క‌నేవారు చ‌క్క‌ని సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌ను, క‌ళాత్మ‌క భావాల‌ను క‌లిగి ఉంటారు.

4. ఖాళీ స‌మ‌యాల్లో ఎవ‌రు ఏం చేస్తారు అనే దానిపై కూడా వ్య‌క్తుల వ్య‌క్తిత్వం ఆధార ప‌డి ఉంటుంది. ఖాళీ స‌మ‌యాల్లో పుస్త‌కాల‌ను ఎక్కువ‌గా చ‌దివేవారు సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగిన వారు అయి ఉంటారు. వీరు ఇత‌రుల‌ను బాగా అర్థం చేసుకుంటారు. ఇక ఖాళీ స‌మ‌యాల్లో టీవీ చూసేవారు, గేమ్స్ ఆడేవారు అంత త్వ‌ర‌గా అర్థం కారు. వారిని అర్థం చేసుకోవడం క‌ష్టం. వీరికి కొత్త ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకునే త‌త్వం ఉంటుంది కానీ ఇత‌రుల అభిప్రాయాల‌కు విలువ‌నివ్వ‌రు.

5. టాయిలెట్ పేప‌ర్‌ను తీసే విధానాన్ని బ‌ట్టి కూడా వ్య‌క్తుల వ్య‌క్తిత్వాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. టాయిలెట్ పేప‌ర్‌ను పై నుంచి తీస్తే వారు అంద‌రినీ డామినేట్ చేసే వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటార‌ని అర్థం. అలాగే వీరికి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. ఇక టాయిలెట్ పేప‌ర్‌ను కింద నుంచి తీస్తే వారు ఇత‌రుల‌పై ఎక్కువ‌గా ఆధార ప‌డ‌తార‌ని అర్థం.

Comments

comments

Share this post

scroll to top