సినిమాలను చూసే విధానం జపాన్ వాళ్లను చూసి నేర్చుకోవాలి!

టికెట్ తీసుకున్నామా….. లోపలికెళ్లామా….సీట్లో కూర్చున్నామా…… సినిమా పేరు, హీరో హిరోయిన్ల పేర్లు తెరమీద పడుతున్నాయా… ఈలలు  వేసామా.. గోలలు చేశామా….? మద్యలో బ్రేక్ వచ్చిందా క్యాంటీన్లో సమోసా విత్ కోక్ కొన్నామా మళ్లీ సినిమా స్టార్ట్ అయ్యిందా… క్లైమాక్స్ అయిపోయిందా….  ఇక పరుగో పరుగు.  ఇది మనం సినిమా చూసే స్టైల్..

క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ కు పెళ్లి కావడమో, కుటుంబాన్ని కలవడమో కాగానే మనం వెంటనే లేచి వెళ్లిపోతాం.. మరి జపాన్ లో సినిమా చూసే పద్దతి మాత్రం చాలా  గొప్పగా ఉంటుంది . నిజమా అంటే  అవును అక్షరాల నిజం… ఈ మాట ఎందుకు అంటున్నామంటే… వారి అభిమానం చూసి, సినిమాకు , నటులకు వారిచ్చే గౌరవాన్ని చూసి.

 

జపాన్ లో ఏ థియేటర్ అయినా, అందులో ఏ సినిమా ఆడుతున్న  వాళ్లిచ్చే గౌరవం  ఎంటో తెలుసా.. సినిమా అయిపోయాక అందులో నటించిన, బిహైండ్ స్క్రీన్ పని చేసిన వారి పేర్లు పడుతుంటాయ్ కదా అప్పుడు కూడా వారు అలాగే కూర్చుండిపోతారు. ఏంటి సినిమా అయిపోయిందిగా ఈ పేర్లు చూడడానికి  కూడా కూర్చోవాలా..? అంటే అలా అని కాదు ఇది మేము వారికిచ్చే గౌరవం అంటారు వారు.. సినిమా లో ఉండే పెద్ద తలకాయలకే కాదు ప్రతి కళాకారుడుకి మేమిచ్చే రెస్పెక్ట్ ఇది  … దిఎండ్ బోర్డ్ పడేంత వరకు కూర్చొని వాళ్లను గౌవరవమిస్తాం.

japan peoples watching movie in theatre

వావ్ నిజంగా ఇది కళను , కళాకారులను ప్రోత్సాహించే పద్దతి.

 

CLICK: అమ్మాయి తన జీవితం లో మరిచిపోలేని రోజు.!

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top