ఇది ATM కాదు ATW..ఇందులో కార్డు పెడితే 20 లీటర్ల మంచినీళ్ళు వస్తాయ్.

Siva Kumar

కార్డు తీసుకొని ATM సెంటర్ కు వెళ్ళి, స్వైప్ చేస్తే..మనం అడిగిన డబ్బులు వస్తాయ్. కానీ ఇక్కడ కార్డ్ తీసుకొని ఆ మెషిన్ లో స్వైప్ చేస్తే డబ్బులకు బదులు 20 లీటర్ల మంచి నీళ్లు వస్తాయ్.  అదెలా అంటారా? గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన స్కీమ్   ఇది.  బాల వికాస సంస్థ ఆద్వర్యంలో తాగునీటి కోసం ATW(ANY TIME WATER) కార్డ్ ను సంవత్సరానికి 360 రూపాయలు  కడితే చెల్లిస్తారు.

ఒకసారి కార్డ్ మూజ్ చేస్తే 20 లీటర్ల మంచి నీటికి 1/- రూపాయి ఆ కార్డ్ నుండి కట్ అవుతుంది. అదే రోజు మరోసారి నీటి కోసం ATW సెంటర్ కు వస్తే ఈ సారి20 లీటర్లకు 4 రూపాయలు ఆ కార్డ్ నుండి కట్ అవుతుంది. స్కీమ్ చాలా బాగుంది. చిన్న బాటిల్ నే 20 రూపాయలు పెట్టి కోనే ఈ విపత్కర పరిస్థితుల్లో బాలవికాస సంస్థ తీసుకొచ్చిన ఐడియా చాలా బాగుంది.

 

ఇప్పటికే ఈ పద్దతి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర లోని 351 గ్రామాల్లో అమలు లో ఉంది. తర్వలో అంతటా విస్తరించే అవకాశాలున్నాయ్.  రోజూ ఉదయం 6 నుండి రాత్రి 7 వరకు ఈ ఎనీటైమ్ వాటర్ కేంద్రాలు తెరిచి ఉంటాయ్.పేద ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేంందుకు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుదాం.

Watch Video:

 

Comments

comments

No Comments on this article. Feel free to join this conversation.

  1. prakash October 3, 2015 at 11:33 pm - Reply

    Dear ap2tg ineed more information about atw machine which used for water supply .i need decontact details of atw machine in telagana plz give a reply to my email

Leave A Response