అతి త‌క్కువ ధ‌ర‌లోనే, నీటి అవ‌స‌రం లేని మూత్ర‌శాల‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

ఇల్లు దాటి బ‌య‌టికి వ‌చ్చామంటే చాలు మూత్ర విసర్జ‌న చేద్దామంటే ఎవ‌రికైనా ఇబ్బందే. మ‌న దేశంలో ఉన్న ఏ న‌గ‌రం, ప‌ట్ట‌ణంలోనైనా స‌రైన రీతిలో మూత్ర‌శాల‌లు లేక జ‌నాలు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉన్న ఒక‌టి, రెండు మూత్ర‌శాల‌లు కూడా కంపు కొడుతూ అత్యంత దీన స్థితిలో ఉంటాయి. ఈ క్రమంలో స‌గటు పౌరుడికి మూత్ర విస‌ర్జ‌న చాలా ఇబ్బందిని క‌లిగించే విష‌యంగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే నీటి అవ‌స‌రం లేని మూత్ర‌శాల‌ల ఏర్పాటుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది. అవి అయితేనే చాలా త‌క్కువ ఖ‌రీదు క‌లిగిన‌వి అయి ఉంటాయి, మెయింటెనెన్స్ అవ‌స‌రం ఉండ‌దు, క‌నుక కంపు కొట్టే స్థితికి రావు. అయితే గ‌తంలో ఇలా నీటి అవ‌స‌రం లేని మూత్ర‌శాల‌లను నిర్మించారు, కానీ అవి ఖ‌రీదైన ప‌ద్ధ‌తులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్వ‌చ్ఛంద సంస్థ అత్యంత త‌క్కువ ఖ‌రీదుతో నీటి అవ‌స‌రం లేని మూత్ర‌శాల‌ల‌ను త‌యారు చేసి ఆశ్చ‌ర్య ప‌రిచింది.

రీప్ బెనిఫిట్ అనే సంస్థ అల్యూమినియం రేకుల‌ను ఉప‌యోగించి త‌క్కువ ధ‌ర‌లోనే నీటి అవ‌స‌రం లేని మూత్ర‌శాల‌లను నిర్మిస్తోంది. వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్ర‌శాల త‌యారీకి కావ‌ల్సిన వ‌స్తువులు…

 • టిన్ షీట్ (Tin Sheet): 0.3mm thick – 15 inches by 20 inches
 • అల్యూమినియం స్ట్రిప్స్ (Aluminum strips): 14 inches length (1 unit) and 8 inches length (2 units)
 • ఎం సీల్ (m-seal) – 2 units
 • టిన్ ఫ‌న్నెల్ (Tin funnel): 10 inches diameter – 1 unit
 • డ్రైనేజీ మౌత్ (Drainage mouth): 50mm diameter – 2 units
 • న‌ట్స్, బోల్ట్‌లు (Nuts and Bolts): m4 – 30 units

త‌యారు చేసేందుకు కావ‌ల్సిన టూల్స్‌…

 • Hammer File (for smoothening metal edges)
 • Scissors
 • Measuring Tape
 • Screw Driver Set
 • Nails
 • Marker
 • Drill Gun
 • L-Angle Rod

తయారీ విధానం…
స్టెప్‌-1: చిత్రంలో ఇచ్చిన విధంగా టిన్ షీట్‌ను మార్కింగ్ చేసి క‌త్తిరించుకోవాలి.


స్టెప్‌-2: క‌ట్ చేసిన షీట్ ఎడ్జ్‌ల‌ను చిత్రంలో చూపిన విధంగా ఎల్ యాంగిల్ రాడ్‌, సుత్తిల‌తో లోప‌లికి వంచాలి. దీంతో ఆ ఎడ్జ్‌లు కోసుకోకుండా ఉంటాయి. ఎడ్జ్‌లు లోప‌లికి మ‌లిచాక ఇలా ఉంటుంది.
లోప‌లికి ఎడ్జ్‌ల‌ను వంచాక కూడా అక్క‌డ‌క్క‌డా షార్ప్ ఎడ్జ్‌లు ఏర్ప‌డ‌తాయి. వాటిని క‌త్తెర‌తో క‌ట్ చేయాలి. అలా క‌త్తిరించిన ఎడ్జ్‌ల‌ను ఆకురాయితో నునుపుగా చేయాలి. దీంతో అవి కోసుకోకుండా ఉంటాయి.


స్టెప్‌-3: చిత్రంలో చూపిన విధంగా ఓ గ‌రాటు లాంటి దాన్ని త‌యారు చేయాలి. దానికి నాలుగు వైపులా రంధ్రాలు చేయాలి.


స్టెప్-4: ఇంత‌కు ముందు త‌యారు చేసుకున్న షీట్‌కు కూడా హోల్స్ చేయాలి. అయితే ఈ హోల్స్ గ‌రాటు నాలుగు హోల్స్‌ను మ్యాచ్ చేసేలా ఉండాలి. అనంత‌రం షీట్‌ను గ‌రాటుపై ఫిక్స్ చేయాలి. హోల్స్‌లో న‌ట్స్‌ను బిగించాలి.


స్టెప్‌-5: చిత్రంలో చూపిన విధంగా షీట్‌కు రెండు వైపులా పైన‌, కింద హోల్స్ చేయాలి. వాటిలో ముందుగానే క‌త్తిరించి పెట్టుకున్న ప్లేట్ల‌ను ఫిట్ చేయాలి. దీంతో చిత్రంలో చూపిన విధంగా త‌యార‌వుతుంది.


స్టెప్‌-6: చిత్రంలో ఉన్న విధంగా డ్రెయిన్ మౌత్‌లో మూడు చోట్ల ఎంసీల్‌ను అత‌కించాలి. అనంత‌రం అందులో టీటీ బాల్ వేయాలి. ఇలా వేయ‌డం వ‌ల్ల మూత్రం వాసన రాదు. అనంత‌రం మ‌రో డ్రెయిన్ మౌత్‌తో దాన్ని మూసేయాలి. దానికి కూడా ఎంసీల్ వేయాలి. ఆ త‌రువాత ఆ పార్ట్‌ను గ‌రాటు కింద అతికించాలి. దీంతో యూరిన‌ల్ రెడీ అవుతుంది. ఇక దీన్ని పీవీసీ పైపుకు ఫిట్ చేయాలి.

ఇలా త‌యారుచేసిన యూరిన‌ల్ వ‌ల్ల మూత్రం వాస‌న రాకుండా ఉంటుంది. అంతేకాదు, దీన్ని త‌యారు చేసేందుకు చాలా త‌క్కువ ఖ‌ర్చు అవుతుంది. నీళ్లు అవ‌స‌రం ఉండ‌వు.

Comments

comments

Share this post

scroll to top