కింగ్ కోబ్రా పామును చూస్తారా..? ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో ఇది..!

పాములంటే బాగా భ‌య‌ప‌డే వారు కింద ఇచ్చిన వీడియోను చూడ‌కండి. ఎందుకంటే ఆ వీడియోను చూస్తే ఇక మీరు బ‌య‌టికి వెళ్లేందుకే భ‌య‌ప‌డ‌తారు. క‌లలో కూడా మీకు అదే క‌నిపించ‌వ‌చ్చు. అవును, విష‌యం అలాంటిది మ‌రి. కింగ్ కోబ్రా… ఈ పేరు వినే ఉంటారు. సాధార‌ణంగా ఈ త‌ర‌హా పాములు చాలా అరుదుగా ఉంటాయి. వీటిని జూ పార్క్‌ల‌లోనే చాలా మంది చూసి ఉంటారు. ఇక డిస్క‌వ‌రీ వంటి చానల్స్ లో అయితే త‌ర‌చూ కింగ్ కోబ్రాలను చూపిస్తూనే ఉంటారు. అయితే అలాంటిదే ఓ పొడ‌వైన కింగ్ కోబ్రా ఓ వ్య‌క్తి ఇంట్లోకి ప్ర‌వేశించింది. దీన్ని అత‌గాడు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఇంకేముందీ… కొన్ని వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు.

మ‌లేషియాలో జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. అక్క‌డ ఉండే డెరిక్ ఇఫాన్ అనే ఓ వ్య‌క్తి ఇంట్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ పొడ‌వైన కింగ్ కోబ్రా అత‌ని ఇంటి బ‌య‌ట త‌చ్చాడింది. లోప‌లికి వెళ్లాల‌ని చాలా సేపు ప్ర‌య‌త్నించింది. చివ‌ర‌కు ఎలాగో వెంటిలేట‌ర్ నుంచి లోప‌లికి దూరింది. ఈ క్ర‌మంలో పాము అలా ఇంట్లోకి వెళ్లిన వీడియోను డెరిక్ షూట్ చేశాడు. అనంత‌రం దాన్ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టాడు. దీంతో ఒక్క‌సారిగా ఆ పోస్ట్ వైర‌ల్ అయింది.

కొన్ని ల‌క్ష‌ల మంది ఆ వీడియోను చూశారు. కొన్ని వేల షేర్లు ఆ పోస్టుకు వ‌చ్చాయి. అయితే స‌ద‌రు కింగ్ కోబ్రా ఇంట్లోకి వెళ్లాక ఏమైంది..? బ‌య‌ట‌కు వ‌చ్చిందా..? అన్న వివ‌రాల‌ను మాత్రం డెరిక్ వెల్ల‌డించ‌లేదు. ఏది ఏమైనా ఈ వీడియోలో ఉన్న కింగ్ కోబ్రా పామును చూస్తే మాత్రం ఎవ‌రికైనా ఒళ్లు జ‌ల‌ద‌రించ‌క మాన‌దు. కావాలంటే మీరూ ఆ వీడియోను చూడ‌వ‌చ్చు. అయితే భ‌య‌ప‌డేవారికి చూపించ‌కండి సుమా..!

Comments

comments

Share this post

scroll to top