టూరిస్ట్: స్పాట్ ల‌క్న‌వ‌రం స‌రస్సు….ఎలా వెళ్లాలి. ? ఏం చూడాలి.? దీని రేటింగ్ ఎంత‌?

చుట్టూ కొండలు,మద్యలో సరస్సు ..ఆ సరస్సులో అక్కడక్కడా చిన్న చిన్న దీవులు..కాంక్రీట్ జంగిల్ లో ఇలాంటి వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అతిశయోక్తేమొ కానీ..హైదరాబాద్ కి దగ్గరలోనే ఇలాంటి ప్లేస్ ఉంది ఎక్కడ అనుకుంటున్నారా..మన వరంగల్ జిల్లాలో… లక్నవరం సరస్సు… ప్రకృతి అందాలతో అలరారుతున్న ఈ సరస్సు కొన్నేళ్ళక్రితం వరకు ఎక్కువగా పరిచయం లేని పేరు..కానీ ఇప్పుడు తెలంగాణ లోని ప్రధాన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది.

  • టూరిస్ట్ స్పాట్ :  ల‌క్నవ‌రం స‌ర‌స్సు.
    అడ్ర‌స్  :  వ‌రంగ‌ల్ జిల్లా గోవింద‌రావు పేట‌.
  • ఎలా వెళ్ళాలి.?: ఒకరోజులో వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసుకొవచ్చు..వరంగల్ నుండి ములుగు వరకు బస్ లో  వెళ్లి అక్కడ నుండి ఆటోస్ ఉంటాయి వాటిల్లో వెళ్లొచ్చు.
  • టైమింగ్స్ :  ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఐదింటివరకూ మనం ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.
  • చూడాల్సిన ప్లేసెస్ ఇంకేమైనా ఉన్నాయా?:  బోట్ షికార్.
  • Rating: 3.5/5.

విశిష్ట‌త‌- చ‌రిత్ర‌:

సరస్సులో ఆరు దీవులు ఉన్నాయి. ఒక్కో దీవిని ఒక్కోరకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది. లక్నవరం సరస్సు క్రీ.శ. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది.. ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి. ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు.లక్నవరం సరస్సు పర్యాటక ప్రదేశంగానే కాదు ఎన్నో దశాబ్దాలుగా రైతుల పాలిట వరప్రదాయిని గా ఉంది.

.

Comments

comments

Share this post

scroll to top