వరంగల్ కలెక్టర్ “బాహుబలి” కి ఏకంగా 350 టికెట్లు బుక్ చేసారు..! ఎవరికోసమో తెలుసా..?

వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి తనకింద పనిచేసే ప్రభుత్వ అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వరంగల్ సిటీ మోడ్రనైజేషన్ వర్క్ లో ఇన్ వాల్వ్ అయిన వారికి ఆమె ఈ టిక్కెట్లు ఇవ్వనున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్న కలెక్టర్ ఆదేశాల ప్రకారం గత పదిహేను రోజులుగా వరంగల్‌ నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న అధికారులందర్నీ ఆనందంలో ముంచెత్తే వార్తను ఆమె వినిపించారు. బాహుబలి-2 సినిమాను వారందరికీ ఉచితంగా చూపించనున్నారు. వారు చేసిన శ్రమకు వెలకట్టలేమని కలెక్టర్ వారందర్లో మరింత ఉత్సాహం కలిగించేలా ఈ పనిచేశారు…వరంగల్‌ పట్టణంలోని ఏషియన్ మాల్ లో లో 350 టికెట్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది  సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. హన్మకొండలోని ఏసియన్ మాల్‌లో 28న వారంతా ఫస్ట్‌ షో చూడనున్నారు. సమర్థురాలైన అధికారణిగానేకాక, గూగుల్ లో ‘ఇండియాలో అత్యధికులు శోధించిన ఐఏఎస్’గా గుర్తింపుపొందిన అమ్రపాలి మరోసారి ఇలా వార్తల్లో నిలిచారు.

కానీ ఇప్పుడు ఆ టికెట్లు బుక్ చేయడమే ఆమెకు ఒక సమస్య తెచ్చిపెట్టింది..! అదేంటో తెలుసా..?

అన్ని టికెట్లు ఎలా బుక్ చేసారు..? గవర్నమెంట్ సొమ్ముని  పర్సనల్ పనులకు వాడుకోవడం చట్టరీత్య నేరం అంటూ కొందరు ఆమెపై విమర్శలు కురిపించారు. దానికి స్పందించిన కలెక్టర్ గారు…

“టికెట్లు బుక్ చేసింది నా సొంత ఖర్చుతో…ప్రభుత్వ సొమ్ము ఉపయోగించలేదు..కావాలంటే పరిశీలించుకోండి. ప్రభుత్వ సొమ్ము వాడకూడదు అని నాకు తెలుసు” అని సమాధానం ఇచ్చి మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు..!

Comments

comments

Share this post

scroll to top