లేడి యాంకర్ చెంప చెల్లుమనిపించిన పార్టిసిపేంట్!

లైవ్ షో ల పేరు మీద, టాలెంట్ హంట్ ల మీద ఎక్కడా లేని పెంటను క్రియేట్ చేస్తున్నారు. షో ను రక్తికట్టించడానికో , పుష్కలంగా ప్రచారం కోసమో… కొన్ని కొన్ని స్పైసీ సీన్లతో నింపేస్తున్నారు. షో న్యాయనిర్ణేతలు అలిగి వెళ్లిపోవడం, కంటెస్టెంట్ ల మద్య గొడవ జరగడం, ఒకరిపై ఒకరు   చేయి చేసుకోవడం ఇవన్నీ ప్రమోషన్ లో బాగాలే.. కానీ ఈ సంఘటన మాత్రం వాటికి భిన్నంగా జరిగింది. లైవ్ షోలోనే లేడీ యాంకర్ పై కంటెస్టెంట్ చేయిచేసుకున్నాడు.. అంతకు ముందు ఆ యాంకర్ కూడా బాగానే రెచ్చగొట్టింది ఆ పార్టిసిపేంట్ ను.

అది డాన్స్ షో… ఇద్దరు  పార్టిసిపెంట్స్  డాన్స్ చేశారు. వారు చేసిన డాన్స్ ఆమెకు నచ్చలేదు. దీంతో… ఈ స్టేజ్ మీద డాన్స్ చేసేది ఇలానా? మీకు సిగ్గులేదు లాంటి  ఘాటైన  పదజాలాన్ని ఉపయోగించింది. అప్పటి వరకు కామ్ గా ఉన్న కంటెస్టెంట్ అప్పుడు తన నోరు విప్పి అది కాదు మేడమ్ అంటూ సమాధానం చెప్పేలోపు, నోర్ముయ్ అంటూ చెంప మీద ఒక్కటిచ్చింది యాంకర్..దీంతో కొపంమొచ్చిన సదరు కంటెస్టెంట్ కూడా ఆమె చెంప చెల్లుమనిపించాడు. తర్వాత షో అంతా రచ్చరచ్చ అయ్యింది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top