హీరో రామ్ కి, TV-5 కి మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది…మద్యలో ఓ ఉద్యోగి ఉద్యోగమే ఊడింది.

ఓకే  ఒక్క రివ్యూ… టోటల్ మీడియాను, సినీ లోకాన్ని షేక్ చేస్తుంది. ఆ రివ్యూ తర్వాత పరిస్థితులు కూడా తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్ లో రామ్  రియల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు ఫ్యాన్స్.

అసలేం జరిగింది…?

హీరో రామ్ లేటెస్ట్ మూవీ ‘నేను శైలజ’ సినిమా పై TV-5 ఛానల్  పూర్తి నెగెటివ్ లో  రివ్యూ  ఇచ్చింది. దానికి ఫీల్ అయిన రామ్   ‘ఆ ఒక్క ఛానల్ లో తప్ప వరల్డ్ వైడ్ నా సినిమా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషమని’ కామెంట్ చేశాడు. ప్రొడ్యూసర్స్ తో పడకపోతే నెగిటివ్ స్టోరీలు రాస్తారా? అందరం న్యూస్ ఛానల్స్ ని నమ్ముతాం. మీరు మాత్రం నిజాలను చెప్పటం మర్చిపోతారా? అంటూ ఆ ఛానల్ ను పాయింట్ అవుట్ చేస్తూ తన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు హీరో రామ్.

అక్కడి వరకు మ్యాటర్ బాగానే ఉన్న రీసెంట్ గా ఆ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. సినిమాకు వ్యతిరేఖంగా రివ్యూ ఇచ్చినటువంటి ఛానల్ లో పనిచేసే నవీన్ అనే ఉద్యోగి హీరో రామ్ కు పెద్ద ఫ్యాన్ అంట, అతను తన fB, ట్విట్టర్లలో సినిమా సూపర్…అంటూ తమ ఛానల్ ఇచ్చిన రివ్యూ ను తప్పుబట్టాడంట! దీంతో  ఆ ఛానల్ యాజమాన్యం అతడిని ఉద్యోగంలోంచి తీసేసిందట.! ?  ఈ విషయం తెలుసుకున్న  రామ్ ట్విట్టర్ లో ఆవేశంగా రెస్పాండ్ అయ్యారు. నవీన్ తన అభిమాని అని తెలిసి అతనికి సారీ చెప్పారు. నవీన్ కు ఉద్యోగం వచ్చేవరకు అతడి జీతం తాను ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

hero tweet

ఈ సొసైటీ ఎటుపోతోందో అర్ధం కావట్లేదని.. ‘నేను శైలజ’ రివ్యూ మీద మాట్లాడినందుకు ఆ ఛానెల్ ఉద్యోగం నుంచి తప్పించడమేంటని.. ట్వీట్ ద్వారా రామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
TV-5 ఇచ్చిన రివ్యూ ఇదిగో ఇలా ఉంది.:

Comments

comments

Share this post

scroll to top